English   

ర‌జినీకాంత్ కు కాలా కుల‌గండం..

kaala in caste problem
2018-06-08 08:03:02

ఎవ‌రు ఒప్పుకున్నా.. ఒప్పుకోక‌పోయినా ఇండ‌స్ట్రీలో కుల‌గ‌జ్జి మాత్రం చాలానే ఉంది. తెలుగులోనే కాదు.. అన్నిచోట్లా అది క‌నిపిస్తుంది. ఇక త‌మిళ నాడు కూడా దీనికి మిన‌హాయింపు కాదు. అక్క‌డ కూడా కుల‌గ‌జ్జి ఉన్న వాళ్లు చాలా మందే ఉన్నారు. దీన్ని రాజ‌కీయాలు కూడా తోడైతే ఆ ర‌చ్చ మ‌రో స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఏ కులం.. ఏ జాతి అనే బేధం లేకుండా ఉన్నాడు ర‌జినీకాంత్. ఈయ‌న‌కు అన్ని మ‌తాలు.. జాతుల నుంచి స‌పోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు విడుద‌లైన కాలాలో మాత్రం ఈయ‌న వెన‌క‌బ‌డిన కులం నుంచి వ‌చ్చిన వాడిలా న‌టించాడు. వాళ్ల కోస‌మే పోరాడే నాయ‌కుడి పాత్ర ఇది. రాజకీయాల్లోకి వ‌స్తున్నాడు క‌దా అందుకే ముందుగానే త‌ను చిన్న‌జాతి వాళ్ల‌కు కూడా అండ‌గానే ఉంటాను అని చెప్ప‌క‌నే చెప్పాడు ర‌జినీకాంత్. 

ఆ ఒక్క కులం కోసం అగ్ర కులాల‌ను అవ‌మానించ‌డం కూడా స‌రైంది కాదంటున్నారు విశ్లేష‌కులు. కాలాలో ఈ కుల రాజ‌కీయాలు కూడా ఉన్నాయి. మీరెక్క‌డ.. మీ బ‌తుకెక్క‌డ‌.. మా కాళ్లు మొక్క‌డానికే మీరున్న‌ది అనే డైలాగులు కూడా ఉన్నాయి. ఇలాంటివ‌న్నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌పుడు.. సినిమాలో ఉంచుకుంటే అగ్ర‌కులాల‌కు ర‌జినీ దూర‌మ‌య్యే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. సినిమా కోసం అన్నా కూడా దాన్ని రాజ‌కీయం చేసేవాళ్లు కూడా ఉంటారు. ఇక క‌బాలి.. కాలా రెండు సినిమాల్లోనూ రంజిత్ వెన‌క‌బ‌డిన ప్ర‌జ‌ల‌నే ఎక్కువ‌గా చూపించాడు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈయ‌న కూడా అదే జాతి నుంచి వ‌చ్చాడు కాబ‌ట్టి.. త‌న వంతు ప్ర‌య‌త్నం తెర‌పై చేస్తున్నాడు. దానికి ర‌జినీ లాంటి సూప‌ర్ స్టార్ స‌పోర్ట్ దొరికింది. 

More Related Stories