English   

ఆ పాత ర‌జినీకాంత్ ఎక్క‌డా..?

Kaala

మాకు ఈ ర‌జినీకాంత్ వ‌ద్దు.. పాత ర‌జినీకాంత్ కావాలి..! టాక్ తో ప‌నిలేకుండా రికార్డుల దుమ్ము రేగ్గొట్టే ర‌జినీకాంత్ కావాలి.. సినిమా ఎలా ఉన్నా తొలి మూడు రోజులు టికెట్స్ కోసం ఆలోచించాల‌న్నా ప్రేక్ష‌కులు భ‌య‌ప‌డే ర‌జినీకాంత్ కావాలి. ఇప్పుడు ఉన్న కాలా ర‌జినీకాంత్ మాకు వ‌ద్దంటూ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ చిత్రం నాలుగు రోజుల్లో క‌నీసం 100 కోట్ల గ్రాస్ కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది. అస‌లు ర‌జినీకాంత్ సినిమా అంటే ఎలా ఉండాలి..? ఒక్క‌సారి క‌బాలినే తీసుకోండి.. ఈ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ తోనే ఓపెన్ అయింది క‌దా.. కానీ వ‌సూళ్లు మాత్రం రికార్డులు తిర‌గ‌రాసాయి. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం అప్ప‌ట్లో 200 కోట్లు వ‌సూలు చేసింది. అందులో షేర్ 125 కోట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలా మాత్రం నాలుగు రోజుల్లో కూడా 100 కోట్లు గ్రాస్ వ‌సూలు చేయ‌లేదంటే ప‌రిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. 

లింగా కంటే పెద్ద డిజాస్ట‌ర్ గా ఇప్పుడు కాలా మార‌బోతుంద‌నే ఊహే అభిమానుల గుండెల్లో.. అటు బ‌య్య‌ర్ల గుండెల్లో మంట‌ల్లా మారిపోతుంది. ఈ చిత్రం ఫుల్ ర‌న్ లో క‌నీసం 100 కోట్ల షేర్ వ‌సూలు చేస్తుందా అనేది కూడా అనుమానమే. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే అక్ష‌రాలా 155 కోట్లు రావాలి. కానీ ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే అందులో స‌గం కూడా వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. త‌మిళ‌నాట కూడా కాలా ఫ్లాప్ కావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. అక్క‌డ ర‌జినీ ఇమేజ్ తో ఆడేస్తుంద‌నుకున్నారంతా. కానీ అక్క‌డ కూడా ఈ చిత్రం నిల‌బ‌డ‌లేక‌పోవ‌డం కాస్త విడ్డూర‌మే. ఓవ‌రాల్ గా కాలా ర‌జినీ కెరీర్ లో మ‌రో డిజాస్ట‌ర్ గా నిలిచిపోయింది. తెలుగులో అయితే లింగా.. విక్ర‌మ‌సింహా.. క‌బాలి.. ఇప్పుడు కాలా వ‌ర‌స‌గా నాలుగో డిజాస్ట‌ర్. అందుకే అంటున్నారు ఇప్పుడు ప్రేక్ష‌కులు.. మాకు ఒక‌ప్పటి పాత ర‌జినీకాంత్ కావాలి. అడుగేస్తు రికార్డులు బద్ధ‌ల‌య్యే పాత ర‌జినీకాంత్ కావాలి అని..! మ‌రి చూడాలి.. ఆ ర‌జినీ ఎప్ప‌టికి బ‌య‌టికి వ‌స్తాడో మ‌ళ్లీ..! అస‌లు వ‌స్తాడో రాడో కూడా తెలియ‌దు. 

More Related Stories