English   

కాలా అనుకున్న టైమ్ కు వ‌స్తుందా..? 

Kaala-Release
2018-03-22 16:45:06

ఏందో ఏమో.. ఈ మ‌ధ్య ర‌జినీకాంత్ సినిమాల‌కు టైమ్ అస్స‌లు బాలేదు. విడుద‌లైన సినిమాలు ఆడ‌టం లేదు.. రెడీ అయిన సినిమాలు విడుద‌ల కావ‌డం లేదు. కాలానే తీసుకోండి. ఈ చిత్రం ఎప్రిల్ 27న విడుద‌ల అంటూ అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు చెప్పిన టైమ్ కు సినిమా వ‌స్తుందా రాదా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఎందుకంటే జ‌రుగుతున్న ప‌రిస్థితులు అలా ఉన్నాయి మ‌రి. ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తైపోయింది. పూర్తై కూడా చాలా కాల‌మైంది. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఇదే పెద్ద స‌మ‌స్య‌గా మారింది. త‌మిళ‌నాట కొన్ని రోజులుగా స్ట్రైక్ న‌డుస్తుంది. ఆ స‌మ్మె కార‌ణంగా ఈ చిత్ర వ‌ర్క్ ఆగిపోయింది. ఈ స‌మ్మె ఎన్ని రోజులు ఉండ బోతుందో తెలియ‌దు కానీ కాబ‌ట్టి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా ఎప్పుడు పూర్త‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే తాము మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో కాలాను ఎప్రిల్ 27న తీసుకొస్తామ‌ని.. రూమ‌ర్లు న‌మ్మొద్దంటూ ట్వీట్ చేసారు లైకా ప్రొడ‌క్ష‌న్స్. నిర్మాత ధ‌నుష్ కూడా ఇదే చెబుతున్నాడు. అయితే ఎంత‌మంది చెప్పినా కూడా కాలా ఇప్పుడు అనుకున్న టైమ్ కు వ‌స్తుందా అనేది అనుమానంగా మారింది. ఎప్రిల్ తొలి వారం వ‌ర‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ బ్యాలెన్స్ ఉంటుంది. అయితే ఈ స‌మ్మె ఎప్ప‌టికి పూర్త‌వుతుందో క్లారిటీ రావ‌డం లేదు. దాంతో రిస్క్ ఎందుక‌ని ముందుగానే మే లో ఓ తేదీని కాలా టీమ్ చూసుకుంటున్నారు. ఈ వారంలో స‌మ్మె విర‌మిస్తే ఓకే.. లేదంటే కాలా అనుకున్న టైమ్ కు రావ‌డం మాత్రం దాదాపు అసాధ్య‌మే. చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

More Related Stories