English   

కాలా సాంగ్ .. కబాలి సౌండ్ వస్తోందే..

Kaala-Song
2018-05-03 11:04:27

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కాలా. జూన్ 7న విడుదల కాబోతోందీ మూవీ. సూపర్ స్టార్ తో కబాలి తీసిన పా. రంజిత్ కాలాకు దర్శకుడు. ధనుష్ నిర్మిస్తున్నాడు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ పాట(తెలుగే) వింటుంటే కబాలి నుంచి నిప్పురా అనే 
సౌండింగే వినిపిస్తోంది. శ్రమజీవుల రంగు నలుపురా.. యమగ్రేటూ మన కాలా సేటూ సాగే ఈ పాటలో కాస్త వెస్ట్రన్ కూడా మిక్స్ అయింది. చరణాలు మరీ స్పీడ్ గా ఉండటంతో పాటు డబ్బింగ్ సాంగ్ కావడంతో నిప్పురా సాంగ్ లా వెంటనే రిజస్టర్ కావడం లేదనే చెప్పాలి. రజినీకాంత్ మాగ్జిమం బ్లాక్ డ్రెస్ లో నే కనిపిస్తున్నాడీ లిరికల్ సాంగ్ లో .  మొత్తంగా క్యారే సెట్టింగా అంటూ ఆ మధ్య టీజర్ తో గర్జించిన సూపర్ స్టార్ ఈ సారి ఈ సినిమా పై మరింత నమ్మకం పెట్టుకున్నాడు. దర్శకుడు రంజిత్ కబాలితో ఫ్లాప్ ఇచ్చినా.. మరోసారి అతన్ని నమ్మింది రజినీ ఫ్యామిలీ. అందుకే ధనుష్ రంగంలోకి దిగి మరీ నిర్మిస్తున్నాడు. రజినీకాంత్ మరోసారి డాన్ గా నటిస్తోన్న ఈ మూవీలో భారీ తారాగణం కనిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీ రజినీకి పెయిర్ గా నటిస్తోన్న కాలాలో నిన్నటి నటి ఈశ్వరీ రావు కూడా ఓ పాత్రకు జోడీగా కనిపించబోతోంది. ఏదేమైనా ఈ మొదటి పాట మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అఫ్ కోర్స్ రజినీ అన్న పేరు తర్వాత ఇంకే పేరు వచ్చినా అవేవీ పనిచేయవు కాబట్టి.. సినిమాకు మెయిన్ హైలెట్ ఆయన మ్యాజిక్కే.. అది కానీ వర్కవుట్ అయితే అంతే సంగతులు. బాక్సాఫీస్ లన్నీ బద్ధలైపోవడమే.

More Related Stories