English   

కాలా టీజ‌ర్.. ఫ్యాన్స్ ర‌చ్చ మొద‌లైందిగా..

rajini and vijay
2018-03-03 13:17:58

ఈ రోజుల్లో హీరోల కంటే ఎక్కువ‌గా అభిమానుల‌కే ఇగో ఫీలింగ్స్ ఉన్నాయి. హీరోలైనా త‌మ ఇమేజ్ త‌గ్గించుకోడానికి ఇష్ట‌ప‌డుతున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం నో అంటున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. ఎలాగూ త‌మిళ ఫ్యాన్స్ ఎలా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ హీరోల కోసం ప్రాణం ఇవ్వ‌డం.. తీయ‌డం కూడా చేస్తారు. ఇప్పుడు కూడా ర‌జినీ, విజ‌య్ ఫ్యాన్స్ మ‌ధ్య ఇలాంటి వార్ జ‌రుగుతుంది. కాలా టీజ‌ర్ విడుద‌లైన నేప‌థ్యంలో అస‌లు ర‌చ్చ మొద‌లైంది. ఈ టీజ‌ర్ విడుద‌లయ్యాక‌ విజ‌య్ ఫ్యాన్స్ వీరంగం ఎక్కువ అయిపోయింది. కాలా టీజ‌ర్ రికార్డుల విష‌యంలో బాగానే వెన‌క‌బ‌డిపోయింది. అప్ప‌ట్లో క‌బాలి కంటే త‌క్కువ వ్యూస్ వ‌చ్చాయి ఈ చిత్ర టీజ‌ర్ కు. చెప్పా పెట్ట‌కుండా అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు టీజ‌ర్ విడుద‌ల చేసాడు నిర్మాత ధ‌నుష్. ఈ టీజ‌ర్ వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి ఉద‌యం వ‌ర‌కు తెలియ‌దు. దాంతో రికార్డుల వేట‌లో బాగా వెన‌క‌బ‌డిపోయాడు ర‌జినీకాంత్. ఇప్పుడు కాలా టీజ‌ర్ ఇలా వెన‌క‌బ‌డ‌టంతో విజ‌య్ ఫ్యాన్స్ తమ హీరోనే ఇక‌పై నెంబ‌ర్ వ‌న్ అంటూ ర‌చ్చ చేస్తున్నారు.

గ‌తేడాది విడుద‌లైన మెర్సల్ రికార్డులు సృష్టించింది. 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఈ చిత్ర టీజర్ విడుదలైన 10 నిమిషాల్లోనే యూ ట్యూబ్‌లో లక్ష లైకులు సొంతం చేసుకుంది. తొలి గంటలో రికార్డు స్థాయిలో 4 లక్షల లైక్స్ సాధించింది. తొలి 5 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్.. 6 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది మెర్స‌ల్ టీజ‌ర్. కానీ ఇప్పుడు విడుద‌లైన కాలా టీజర్ మాత్రం ఒక రోజులో కోటి వ్యూస్ అందుకుంది.. ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల 42 వేల లైకులు సాధించింది. కానీ మెర్స‌ల్ తో పోలిస్తే ఇది త‌క్కువే. దాంతో ర‌జినీ కాదు ఇప్పుడు విజ‌య్ నెంబ‌ర్ వ‌న్ అంటూ సోష‌ల్ మీడియాలో వార్ మొద‌లైంది. దీనిపై ఇటు ర‌జినీ కానీ.. అటు విజ‌య్ గానీ స్పందించ‌ట్లేదు. కానీ మ‌ధ్య‌లో అభిమానులు కొట్టుకు చ‌స్తున్నారు. అస‌లు త‌మిళ‌నాట ర‌జినీకాంత్ ఉన్నంత వ‌ర‌కు ఆయ‌నే నెంబ‌ర్ వ‌న్. ఆ త‌ర్వాత స్థానం కోస‌మే అస‌లు గొడ‌వ అని విజ‌య్ అభిమానుల‌కు ఎందుకు అర్థం కావ‌ట్లేదో మ‌రి..?

More Related Stories