English   

మిడతల దాడి గురించి బందోబస్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

KV Anand
2020-05-29 09:04:34

ఒక పక్క భారత్ ను కరోనా వైరస్ రకరకాలుగా ఇబ్బంది పెడుతోంటే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. అదే మిడతల దండు ఎటాక్. పాకిస్థాన్ నుంచి వచ్చినట్టుగా చెబుతున్న మిడతల దండు మన దేశంలోకి ఎంటర్ కావడమె కాక తెలంగాణాకు చాలా దగ్గరగా కూడా వచ్చేశాయి. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో పంటను నాశనం చేసిన ఈ మిడతల దండు ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల మీదకు రావడానికి రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఇంత రచ్చ చేస్తుందంటే ఈ తరహా మిడతల దాడి గురించి ఇటీవలే స్టార్ హీరో సూర్య నటించిన బందోబస్తు సినిమాలో చూపించారు.

గతేడాది విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడకున్నా ఆ సినిమాలో చర్చించిన మిడతల విషయంగా ఈ సినిమా మరోసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా.. ఈ మిడతల దాడి గురించి ఆ సినిమా దర్శకుడు ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని తను ఏమీ ముందు ఊచించి తీయలేదని, అంతకు ముందే చూసిన విషయాన్ని సినిమాలో చూపించానని ఆయన పేర్కొన్నారు. 9 సంవత్సరాల క్రితం సూర్యతో తెరకెక్కించిన బ్రదర్స్ సినిమా కోసం లొకేషన్ సెర్చ్ లో భాగంగా మడగాస్కర్ వెళ్లానన్న ఆయన ఆ సమయంలో అక్కడ మిడతలు ఇలానే గుంపుగా దాడి చేశాయని దాని వలన కారును రోడ్డుపైనే కొన్ని గంటల పాటు ఆపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.  ఆ తరువాత అక్కడి స్థానికుల నుంచి మిడతల దాడి గురించి కాస్త సమాచారాన్ని తెలుసుకుని బందోబస్తు సినిమాలో పెట్టానని అన్నారు.

ఈ మిడతల దాడి ముంబైలో 1903 నుంచి 1906 మధ్య జరిగిందని చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం వెంటనే అలర్ట్ అయి వాటిని కంట్రోల్ చేయాలని అన్నారు. ఇక మిడతల సంఖ్య పెరగకుండా ఉండేందుకు కూడా ఆనంద్ కొన్ని సూచనలు చేశారు. మగ మిడతల్లో సంతానోత్పత్తికి అవసరమయ్యే వాటిని తొలగించడం ద్వారా వీటి సంఖ్యను తగ్గించొచ్చని తద్వారా భారీ నష్టాన్ని ఆపొచ్చని ఆనంద్ చెప్పుకొచ్చారు. సాధారణంగా ఈ టెక్నిక్ ను దోమలు నియంత్రించడం కోసం వాడతారని కేవీ ఆనంద్ సూచించారు. 

More Related Stories