English   

కాలా కంటే కబాలియే బెటర్ ‘తలైవా..’

Kabali better than Kaala 'talaiva ..'
2018-06-08 20:59:47

తమిళనాడులో పెద్ద పండగ ఎప్పుడు వస్తుంది.. వెరీ సింపుల్.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదలైనప్పుడు. యస్.. సూపర్ స్టార్ సినిమా వస్తోందంటే అక్కడ పంగడను మించిన వాతావరణం కనిపిస్తుంది. లేటెస్ట్ గా భారీ అంచనాల మధ్య కాలా వాటిని అందుకోవడంలో కాస్త వెనకబడ్డాడు. బట్ లాస్ లోకి వెళతాడని మాత్రం చెప్పలేం. పా. రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన కాలా.. కబాలిని మించలేకపోయిందనేది ట్రేడ్ అంచనా..

లాస్ట్ ఇయర్ ఇదే దర్శకుడితో చేసిన కబాలి.. భారీ అంచనాలతో విడుదలై ఫస్ట్ డే కే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా రజినీ మానియాను బట్టి కబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ 70కోట్లకు పైన సాధించింది. కానీ ఈ సారి ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. మళ్లీ కబాలి దర్శకుడే కావడం.. ట్రైలర్ ను బట్టి ఇది ఇష్యూ బేస్డ్ మూవీగా ఆడియన్స్ ఫిక్స్ అయిపోవడం వంటివి కారణాలనుకోవచ్చు. దీంతో ఈ గురువారం వచ్చిన కాలా ఫస్ట్ డే కేవలం 50కోట్లను మాత్రమే అందుకున్నాడు. వీటిలో హయ్యొస్ట్ 17కోట్లు తమిళనాడు నుంచే వస్తే మరో 17కోట్లు విదేశీ మార్కెట్ నుంచి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కాలా 7కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటాడు. ఇక కర్ణాటకలో రిలీజ్ కాకపోవడం కూడా కొంత మైనస్ అయింది. మొత్తంగా అభిమానులు ముద్దుగా తలైవా అని పిలుచుకునే సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా కమర్షియల్ గా పెద్ద విజయం సాధిస్తుందనుకోలేం. బట్ లాస్ ప్రాజెక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాబోదు.. 

More Related Stories