English   

చార్మినార్ ద‌గ్గ‌ర సిఎం ల‌వ‌ర్.. !!

kairaadvani
2018-07-02 21:02:13

అవునా.. ఏ ముఖ్య‌మంత్రి ప్రియురాలు.. ఆమె చార్మినార్ కు ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా..? ఇక్క‌డ సిఎం ల‌వ‌ర్ అంటే సినిమా ముఖ్య‌మంత్రి ప్రియురాలు అని అర్థం. ఈ మ‌ధ్యే వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ గాళ్ ఫ్రెండ్ గా న‌టించింది కైరాఅద్వానీ. అందులో మ‌హేశ్ ముఖ్య‌మంత్రి క‌దా.. అలా సిఎం గాళ్ ఫ్రెండ్ గా ఫిక్స్ అయిపోయింది కైరా. ప్ర‌స్తుతం ఈమె రామ్ చ‌ర‌ణ్ సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగు తుంది.

షూటింగ్ గ్యాప్ లో భాగ్య‌న‌గ‌ర అందాలు చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక‌పై కూడా ఇక్క‌డే ఉండాల‌ని గ‌ట్టిగా ఫిక్స్ అయిన‌ట్లుంది అందుకే సిటీ సెంట‌ర్ లో ఎలాంటి భ‌యం లేకుండా సింపుల్ గా మొహానికి గుడ్డ క‌ట్టుకుని తిరిగేస్తుంది కైరా. మేక‌ప్ లేక‌పోవ‌డంతో కైరాను చాలా మంది గుర్తు కూడా ప‌ట్ట‌లేక‌పోయారు. దాంతో మామూలు అమ్మాయి మాదిరే చార్మినార్ సందుల్లో తిరిగేసింది కైరా. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ సినిమాతో పాటు మ‌రో రెండు తెలుగు సినిమాలు కూడా కైరాకు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

More Related Stories