English   

ఎన్టీఆర్ కోసం..లోక‌ల్ బేబీ మ‌రోసారి చిందుల్..

Kajal acts in another item song

మొన్న‌టి వ‌ర‌కు అస‌లు ఐటం సాంగ్స్ అంటేనే పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కాజ‌ల్. కానీ ఇప్పుడు ఈమె కూడా స్పెష‌ల్ సాంగ్స్ వైపు అడుగులు వేస్తుంది. జ‌న‌తా గ్యారేజ్ తో సినిమాతో ఐటం గాళ్ గా మారిపోయింది చంద‌మామ‌. ఇక ఇప్పుడు మ‌రోసారి ఎన్టీఆర్ కోస‌మే కాలు కదప‌నుంది ఈ ముద్దుగుమ్మ‌. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న అర‌వింద స‌మేత‌లో కాజ‌ల్ ఐటం సాంగ్ చేయ‌బోతుంద‌నే వార్త‌లు వినిపిస్తు న్నాయి. దీనిపై ఇంకా అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు కానీ క‌చ్చితంగా కాజ‌ల్ ఈ పాట‌లో క‌నిపిస్తుంద‌నే స‌మాచారం మాత్రం వ‌చ్చేసింది. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే కాజ‌ల్ ఈ పాట‌లో చిందేయ‌బోతుంద‌ని తెలుస్తుంది. పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాట కోసం కాజ‌ల్ భారీగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ప‌క్కా లోక‌ల్ బేబీతో ఎన్టీఆర్ మ‌రోసారి వేయ‌బోయే చిందులు ఎలా ఉండ‌బోతున్నాయో..? 

More Related Stories