English   

కాజల్ టెంపర్ కు బ్రేకులు

kajal agarwal
2018-02-27 17:04:09

ఒక భాషలో హీరోయిన్ మరోభాషలో ఐటమ్ గాళ్ అంట. అలాగే ఉంటుంది పరిస్థితి. ఒక భాషలో సూపర్ హిట్ సినిమాలో నటించినంత మాత్రాన ఆ సినిమా మరో భాషలో రీమేక్ అయితే తనే హీరోయిన్ అవుతుందనుకోకూడదు. అనుకుంటే కూడా కుదరదు. అందుకు  పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాజల్ అగర్వాల్. తెలుగు నుంచి హిందీలో రీమేక్ అవుతోన్న ఓ సినిమాపై కాజల్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అమ్మడికి అంత లేదని తేల్చాడా నిర్మాత.కాజల్  సౌత్ లో టాప్ హీరోయిన్ అయినా.. ఈ భామకు బాలీవుడ్ కలలూ జాస్తిగానే ఉన్నాయి. అడపాదడపా అక్కడ ప్రయత్నాలు చేసింది. పాగా వేయడానికి ఎంగిలిముద్దులూ లాగించింది. కానీ బాలీవుడ్ పర్సనాలిటీ కాదీ బ్యూటీది. అందుకే కొన్ని సినిమాలు హిట్ అయినా అక్కడి హీరోయిన్ గా కాజల్ ఫిట్ కాదని తేల్చారు మేకర్స్. కానీ అమ్మడికి ఈ విషయం అర్థమైనట్టు లేదు. ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ చేసింది కాజల్. ఇందులో ట్రెడిషనల్ గా కనిపించింది. ఇప్పుడీ మూవీ హిందీలో రణ్ వీర్ సింగ్ హీరోగా రీమేక్ అవుతోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. సునిల్ శెట్టి దర్శకుడు. అయితే రోహిత్ కు కాజల్ ను తీసుకోవాలనే ఉన్నా.. కరణ్ కు కాజల్ పెద్దగా నచ్చలేదట. నిజానికి టెంపర్ లో హీరోయిన్ పాత్రేమీ గొప్పగా ఉండదు. ఏదో క్లైమాక్స్ లో కాస్త కన్నీళ్లు పెట్టించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. కానీ ఇలాంటి సీన్స్ హిందీలో ఉంటాయనుకోలేం. అయినా సినిమా హిట్ అయితే పాత్ర ఎలా ఉన్నా రికగ్నిషన్ వస్తుందనేది ఈ బ్యూటీ ఆరాటం. కానీ ఆమె ఆరాటానికి చెక్ పెట్టాడు కరణ్ జోహార్. మాగ్జిమం ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న భామలనే పరిచయం చేయడం కరణ్ స్టైల్. ఈ సినిమాతోనూ మరో ఫ్యామిలీ లేడీని బరిలోకి దించాలనుకుంటున్నాడట. తను మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారాఖాన్. ఇంకా హీరోయిన్ గా చేయలేదు కానీ చేస్తే బాలీవుడ్ ను షేక్ చేసే షేప్స్ ఉన్నాయీ భామకు. మరి సారా ఈ సినిమా చేయడానికి సైఫ్ ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియదు కానీ.. కరణ్ మాత్రం ఆ భామనే తీసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ రకంగా కాజల్ కు ఈ చాన్స్ మిస్ అయిపోయింది..

More Related Stories