English   

కాజ‌ల్ అందుకే ఒప్పుకుందా..?

Kajal-Agarwal
2018-07-11 17:37:48

స్టార్ హీరోల‌తో వ‌ర‌స సినిమాలు చేయ‌డానికి ఒప్పుకుంటే అదో లెక్క‌. కానీ త‌న‌కంటే ఇమేజ్ లో చిన్న‌వాడైనా హీరోతో న‌టించ‌డానికి రెండో సారి కూడా ఒప్పుకుందంటే ఒక‌టి పారితోషికం భారీగా ముట్టుండాలి.. రెండు క‌థంతా త‌న‌పై అయినా న‌డుస్తూ ఉండాలి. ఇప్పుడు కాజ‌ల్ కు ఈ రెండూ క‌లిసొచ్చాయి. తేజ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప‌దేళ్ల కింద ల‌క్ష్మీక‌ళ్యాణంతో త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసాడ‌నే కృత‌జ్ఞ‌త‌తో ఇప్ప‌టికీ గురువుగారు అంటూ తేజ వెంట తిరుగుతుంది కాజ‌ల్. గ‌తేడాది కూడా నేనేరాజు నేనేమంత్రిలో రానాతో రొమాన్స్ చేసింది. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మ‌రోసారి రొమాన్స్ కు రెడీ అయింది. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే బెల్లంకొండ‌తో ఇప్ప‌టికే ఓ సినిమాలో న‌టి స్తుంది కాజ‌ల్. అంత‌లోనే మ‌రో సినిమా వ‌ర‌స‌గా రెండోసారి ఛాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం కోసం ఏకంగా రెండు కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది చంద‌మామ‌. ఏం చేస్తాం.. ఇప్పుడు కాజ‌ల్ ఇమేజ్ అలా ఉంది మ‌రి. స్టార్ హీరోలు ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా చిన్న హీరోల‌కు మాత్రం కాజ‌ల్ పెద్ద వ‌రంలా మారిపోయింది. తేజ సినిమాలో క‌థ మొత్తం కాజ‌ల్ పైనే న‌డుస్తుంద‌ని.. బెల్లంకొండ ఆ క‌థ‌కు ఓ మార్గ నిర్దేశ‌కుడిగా ఉంటాడ‌ని తెలుస్తుంది. దాంతో క‌థ‌కు క‌థ‌.. డ‌బ్బుకు డ‌బ్బు వ‌స్తుండ‌టంతో మ‌రో ఆలోచ‌న లేకుండా గురువు సినిమాకు సైన్ చేసింది కాజ‌ల్.

More Related Stories