English   

కుర్ర హీరోతో కాజల్ రొమాన్స్ ..

Kajal-Agarwal

స్టార్డమ్ కోసం స్టార్ హీరోలనే తీసుకుంటూ వెళుతోన్న కుర్రాడు బెల్లంకొండ శ్రీనివాస్. కుర్రాడు ఫస్ట్ మూవీకే సమంతతో రొమాన్స్ చేశాడు. తర్వాత ఓ కొత్త బ్యూటీని తీసుకున్నా.. రకుల్ ప్రీత్ సింగ్, లేటెస్ట్ గా టాలీవుడ్ హాట్ కేక్ పూజా హెగ్డేతో సాక్ష్యం చేస్తోన్న శ్రీనివాస్ ఈ సారి కాజల్ ను తీసుకున్నాడు. ప్రస్తుతం చేతిలో పెద్ద సినిమాలేం లేకపోవడంతో కాజల్ కూడా వెంటనే ఓకే చెప్పేసింది. ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ అనే కుర్రాడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. వంశ ధార క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 

ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ మే 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ రోజు పోటీ మరీ ఎక్కువగా ఉండటంతో రంజాన్ కు విడుదల చేద్దామనే ప్లాన్ లోనూ ఉన్నారు. ఇటు కాజల్ కు తెలుగులో పెద్దగా సినిమాల్లేవు. రీసెంట్ గా చేసిన ఎమ్మెల్యే విడుదలైంది. తమిళంలో పారిస్ పారిస్ అనే సినిమా చేస్తోంది. దీంతో శ్రీనివాస్ తో రొమాన్స్ కు ఒప్పేసుకుంది. పైగా ఈ కుర్రాడితో యాక్ట్ చేసే ఏ హీరోయిన్ కైనా రెమ్యూనరేషన్ ఫిగర్ అదిరిపోతుంది. అదీ ఓ రీజన్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా బెల్లంకొండ కుర్రాడి లక్కే వేరబ్బా.. 
 

More Related Stories