English   

మరోసారి రానా సరసన కాజల్

rana
2020-02-25 19:33:03

దర్శకుడు తేజ మొన్ననే తన పుట్టినరోజున రెండు చిత్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అలిమేలుమంగ వేంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిల్స్‌ ప్రకటించాడు తేజ. అయితే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఇంకెవరినీ ప్రకటించ లేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు సినిమాలు రెండు రానా, గోపీచంద్‌ కథానాయకులుగా తెరకెక్కనున్నాయి. అయితే ఏ చిత్రం ఏ హీరోతో అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇదిలా ఉంటే రానాతో తెరకెక్కించే చిత్రంలో నాయికగా కాజల్‌ను ఎంపిక చేయాలని తేజ భావిస్తున్నాడని అంటున్నారు. ఈ కధకి  రానా పక్కన, కథకు కాజల్‌ అయితే బావుంటుందని, అందుకే ఆయన కాజల్ కి కధ చెప్పి ఒప్పించాడని అంటున్నారు. గతంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తొలిసారి కలిసి నటించారు రానా, కాజల్‌. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో సినిమా కూడా బాగా ఆడింది. ఆ జోడి మరోసారి కనువిందు చేయబోతుందన్న మాట. త్వరలోనే ఈ రెండు సినిమాల మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories