English   

కాజ‌ల్ ప్రీ వెడ్డింగ్ ఫోటో వైర‌ల్

Kajal Aggarwal
2020-10-29 12:21:33

అందాల చందమామ అక్టోబర్ 30న పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాజల్ పెళ్లి పనులు చకచకా పూర్తవుతున్నాయి. బుధవారం నాడు జరిగిన మేహేంది ఫంక్షన్ కు సంబందించిన ఫోటోలను కాజల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాజల్ అగర్వాల్ ఆ ఫోటోను షేర్ చేసిన కొద్దిసేపటికే ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇక చందమామ ఫొటోకు నెటిజన్లు అభిమానులు ముందుగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతే కాకుండా తమ ఫెవారేట్ హీరోయిన్ పెళ్లి తరవాత కూడా సినిమాల్లో రాణించాలని కోరుకుంటున్నారు. 

మరోవైపు ఈరోజు కాజల్ సంగీత్ ఫంక్షన్ జరగనున్నట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో కాజల్ పెళ్లి అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సభ్యులతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హాజరుకన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ చందమామ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత రాజమౌళి కంట పడిన ఈ భామ మగధీర సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఆ తరవాత కాజల్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. అంతే కాకుండా దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి పక్కన నటించే అదృష్టం కాజల్ కు దక్కింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

More Related Stories