English   

కాజ‌ల్ ఆ న‌ల్ల‌న‌య్య‌తో న‌టిస్తుందా..?

Kajal-Aggarwal-To-Romance-Raghava-Lawrence
2017-05-05 01:22:04

కాజ‌ల్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌తో బిజీగా ఉంది. మొన్న‌టికి మొన్న మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీలో ర‌చ్చ చేసిన చంద‌మామ‌.. ఇప్పుడు కోలీవుడ్ సూప‌ర్ స్టార్స్ అజిత్, విజ‌య్ సినిమాల్లో న‌టిస్తుంది. వివేగంలో అజిత్ తో.. అట్లీకుమార్ సినిమాలో విజ‌య్ తో జోడీక‌ట్టింది. విజ‌య్ తో గ‌తంలోనే జిల్లా, తుపాకి సినిమాలు చేసింది కాజ‌ల్. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీలో న‌టిస్తుంది. ఇక అజిత్ తో న‌టించ‌డం ఇదే తొలిసారి. ఇలా వ‌ర‌స‌గా స్టార్ హీర‌ల‌తో జోడీ క‌డుతున్న ఈ ముద్దుగుమ్మ‌కు ఇప్పుడు ఓ చిన్న హీరోతో ఆఫ‌ర్ వ‌చ్చింది.

అత‌డెవ‌రో కాదు.. లారెన్స్. ఈయ‌న హీరోగా ఈ మ‌ధ్య బాగా బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి శిష్యుడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు లారెన్స్. ఈ చిత్రానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తుండ‌టం విశేషం. ఇందులో కాజ‌ల్ ను తీసుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రి సూప‌ర్ స్టార్స్ తో న‌టిస్తోన్న కాజ‌ల్.. ఈ న‌ల్ల‌న‌య్య‌తో న‌టించ‌డానికి ఓకే అంటుందో లేదో..?

More Related Stories