English   

కాజల్ అగర్వాల్ కొడుకును చూశారా..?

Kajal-Aggarwal

పెళ్లి కాకుండా కాజల్ కు కొడుకేంటీ అనుకుంటున్నారా..? కొడుకంటే ఆమె సొంత కొడుకు కాదు.. కానీ చెల్లెలి కొడుకు. యస్.. తనతో పాటు సినిమాల్లోకి వచ్చి సోలో సినిమాలో మెరిసిన బ్యూటీ నిషా అగర్వాల్ గుర్తుందా.. తనకు స్టార్డమ్ రాదనే విషయం ముందే తెలుసుకుని.. ప్రేమించిన వ్యక్తిని కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇప్పుడో కొడుకు. ఆ బాబును ఎత్తుకుని ఉన్న ఫోటోను అమ్ముడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆరు నెలల వయసులో చూడ్డానికి బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు. తన చెల్లెలుతో కలిసి బాబుతో ఉన్న మరో ఫోటోనూ షేర్ చేసింది.. మొత్తానికి అమ్మ కాక ముందే అమ్మడు పెద్దమ్మ అయిందన్నమాట. 

ఇక ప్రస్తుతం కాజల్ చేతిలో తెలుగు సినిమాలు పెద్దగా లేవు. తమిళ్ లో మాత్రం పారిస్ పారిస్ అనే సినిమా చేస్తోంది. బాలీవుడ్ క్వీన్ కు రీమేక్ ఇది. ఈ సమ్మర్ లో వచ్చిన ఎమ్మెల్యేతో పాటు అఁ సినిమాలోనూ మెరిసిందీ బ్యూటీ. గతేడాది నేనేరాజు నేనేమంత్రితో యాభై సినిమాలు పూర్తి చేసుకున్న ఈ చందమామ కెరీర్ కూడా క్లైమాక్స్ లోనే ఉందిప్పుడు. ఇప్పటికే లాంగ్ లైఫ్ కెరీర్ ను ఎంజాయ్ చేసిన కాజల్ ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తోంది. అందుకే ఈ గ్యాప్ అంటోంది. కానీ నిజానికి కాజల్ కు ఆఫర్స్ రావడం లేదనేది నిజం. చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 చేసిన తర్వాత మళ్లీ ఆ రేంజ్ సీనియర్ హీరోలే అప్రోచ్ అవుతున్నారు. దీంతో సీనియర్స్ సినిమాలకు నో చెబుతోంది. మొత్తంగా పెద్దమ్మగా మెరిసే కళ్లతో మురిసిపోతోందీ చందమామ.

More Related Stories