English   

కాజల్ ఆ కుర్రాడి కోసం ఏం చేసిందో తెలుసా

kajal agarwal

హీరోయిన్ గా హాఫ్ సెంచరీ కొట్టినా ఆఫర్స్ తగ్గని బ్యూటీ కాజల్ అగర్వాల్. వరుస సినిమాలతో ఇప్పటికీ బిజీగానే ఉన్న ఈ బ్యూటీపై ఓ యంగ్ హీరో కన్ను పడింది. అతని కన్ను పడితే ఎంతటి హీరోయిన్ అయినా నో చెప్పే పరిస్థితి ఉండదు. లేదా అలాంటి పరిస్థితి రానీయడా కుర్ర హీరో. అందుకే కాజల్ కూడా అతని మాటకు కట్టుబడి అతనితో రొమాన్స్ కు సిద్ధపడిందనే వార్తలు టాలీవుడ్ ల హల్ చల్ చేస్తున్నాయి. మరి ఆ కుర్ర హీరో ఎవరో తెలుసా.. బెల్లంకొండ సాయి  శ్రీనివాస్.. హీరోగా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆల్రెడీ స్టార్డమ్ ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడం బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ నుంచీ చేస్తున్నాడు. అతనిచ్చే ఆఫర్స్ కు ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఆల్రెడీ పెద్ద పెద్ద స్టార్స్ చేసి ఉన్నా సరే.. వెంటనే యస్ చెప్పేస్తున్నారు. అతని చెక్ పవర్ అలాంటిది మరి. ఫస్ట్ మూవీలోనే సమంతతో రొమాన్స్, తమన్నాతో ఐటమ్ సాంగ్ చేశాడు. తర్వాత స్పీడున్నోడులో సోనారిక భడోరియాతో రొమాన్స్ మళ్లీ తమన్నాతో ఐటమ్.. జయజానకి నాయకలో ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు మోస్ట్ క్రేజీయొస్ట్ బ్యూటీ ఇన్ టాలీవుడ్ గా చెప్పుకుంటోన్న పూజా హెగ్డేతో సాక్ష్యం చేస్తున్నాడు. అలా కాజల్ కూడా ఈ కుర్రాడి చెక్ లో పడిపోయిందని టాక్. యస్ ఈ గురువారం ప్రారంభమైన శ్రీనివాస్ కొత్త సినిమాలో అతని సరసన కాజల్ హీరోయిన్ గా నటించబోతోందనే వార్త ఆల్మోస్ట్ కన్ఫార్మ్. అది అఫీషియల్ గా రావడమే తరువాయి. ఇక ఈ కథలో మరో ట్విస్ట్.. ఈ సినిమా కోసమే కాజల్ ఆల్రెడీ యస్ చెప్పిన నిఖిల్ సినిమా నుంచి తప్పుకుంది. నిఖిల్, స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో ముందు కాజల్ నే అనుకున్నారు. కానీ అందులో అమ్మడి పాత్ర చిన్నది. దీంతో భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. కానీ చిన్న పాత్రకు అంత రెమ్యూనరేషన్  ఎవరు ఇస్తారు. అంటే ఆటోమేటిక్ గా వాళ్లు నో చెబుతారు.. తను ఈ ప్రాజెక్ట్ కు యస్ చెప్పొచ్చు. ఇక్కడైతే అడగకుండానే అదిరిపోయే రెమ్యూనరేషన్ వస్తుంది కదా.. అదీ ప్లాన్. సో.. ఈ కుర్రాడి కోసం ఆ కుర్రాడికి హ్యాండ్ ఇస్తోందన్నమాట కాజల్..

More Related Stories