English   

విజయ్ తో కాజల్ రొమాన్స్ 

vijay kajal
2018-07-16 20:26:34

కొన్ని కాంబినేషన్స్ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కాజల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ కనీసం ఆ వైపు ఆలోచించి అయినా ఉండడు. కానీ ఇప్పుడు మూణ్నాలుగు సినిమాలకే ఏకంగా తనతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. యస్.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అది కూడా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ ను అందిస్తాడనే పేరున్న క్రాంతిమాధవ్ దర్శకత్వంలో. మూడు సినిమాలకే తనకంటూ ఓ ముద్ర వేసిన దర్శకుడు క్రాంతి మాధవ్. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న అతను తర్వాత సునిల్ తో చేసిన ఉంగరాల రాంబాబుతో ఇబ్బంది పడ్డాడు. కానీ ఆశ్చర్యంగా ఈ సినిమా ఫ్లాప్ దర్శకుడిపై పడలేదు. ఇక కెఎస్ రామారావుతో క్రాంతి మాధవ్ ఓ సినిమా చేయాల్సి ఉంది.

తన కథకు విజయ్ కరెక్ట్ అని పెళ్లి చూపులు తర్వాతే ఫిక్స్ అయ్యాడీ దర్శకుడు. ఈ మేరకు రామారావు కూడా విజయ్ డేట్స్ లాక్ చేసుకున్నాడు. అయితే ఆల్రెడీ అయిన కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ కథ పట్టాలెక్కుతుందని అందరికీ ముందే తెలుసు.ఈ లోగా క్రాంతి మాధవ్ కథను ఇంకాస్త మెరుగులు దిద్దుతాడు. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఎప్పుడూ అని వస్తోన్న ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది టీమ్. అంతే కాదు.. హీరోయిన్ గా కాజల్ అంటూ కొత్త వార్తతో సర్ ప్రైజ్ ఇచ్చారు. 

ప్రస్తుతం కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ అనదగ్గ ఫేజ్ లో ఉంది. అయితే ఆశ్చర్యంగా ఈ ఫేజ్ లో అమ్మడు అంతా యంగ్  స్టర్స్ తోనే నటిస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండు సినిమాలు కమిట్ అయి ఉన్న ఈ చందమామ.. అటు శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చే సినిమాకూ ఓకే చెప్పింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో. సో.. మొత్తంగా ఈ కాంబినేషన్ కూడా ట్రేడ్ లో హైప్ పెంచుతుందనేది నిజం. 

More Related Stories