English   

రవితేజకు నో చెప్పిన కాజల్

Ravi-Teja-kajal

రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తోన్న అమర్ అక్బర్ ఆంటోనీలో చేయనని ఖచ్చితంగా చెప్పేసింది కాజల్. ప్రస్తుతం మరీ గొప్ప ఆఫర్లేం లేకపోయినా వచ్చిన ఆఫర్ ఎందుకు వదులుకుందని చాలామంది అనుకుంటున్నారు. మరికొందరు చేయమని అడిగారు కూడా. బట్ నో అనేసింది. నిజానికి ఇది కాజల్ కు మంచి చాన్స్. మైత్రీ మూవీస్ వంటి బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా మున్ముందు యూజ్ ఫుల్ గా ఉంటుంది. అయినా ఎందుకు నో చెప్పిందో తెలుసా.. కేవలం రవితేజ ఉన్నాడనే. యస్.. రవితేజ ఉన్నాడనే కారణంతోనే కాజల్ ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పింది. మరోవైపు శ్రీను వైట్ల  కూడా ఉన్నా.. తను నో చెప్పడానికి ఏకైక రీజన్ రవితేజ. ఇన్ డైరెక్ట్ గా ప్రొడక్షన్ హౌస్ కూడా ఓ కారణం అనే మాటలూ వినిపిస్తున్నాయి. 

రవితేజతో చేయడానికి కాజల్ కు వచ్చిన ఇబ్బందేంటీ అనిపించొచ్చు. ఉంది. ఎందుకంటే కాజల్ ఈ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా పోతుందనే నమ్మకంతో ఉంది. కారణం.. వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలూ డిజాస్టర్స్. వీర, సారొచ్చారు. ఈ రెండూ భారీ ఫ్లాప్స్. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే అనుమానంతోనే రవితేజకు నో చెప్పింది కాజల్. మరోవైపు కాజల్ అంటే శ్రీను వైట్లకు సెంటిమెంట్.. మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్ కావొచ్చేమో అనిపించొచ్చు. కాజల్ మరీ తెలివితక్కువదేం కాదు కదా.. అందుకే శ్రీను కోసం చేద్దామనే ఆలోచన కూడా చేసింది. శ్రీను కూడా అదే చెప్పాడు. నా కోసమైనా కాజల్ ఒకే చెబుతుందని. దీంతో నిర్మాతలు కాజల్ ను అప్రోచ్ అయ్యారు. కానీ ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ కు మైత్రీ మూవీస్ అంగీకరించలేదు. మైత్రీ మూవీస్ రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోవడం ఏంటీ అనుకుంటున్నారా..? అవును ఎందుకంటే ఇది క్రేజీ ప్రాజెక్ట్ కాదు. హీరో, దర్శకుడు ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. అందుకే వీలైనంత లో బడ్జెట్ లోనే చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంద మైత్రీ మూవీస్. ఈ కారణంగానే కాజల్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడం కుదరదన్నారు. దీంతో కాజల్ కూడా సింపుల్ గా నో అనేసింది. అదీ మేటర్.

More Related Stories