English   

చాలా గ్యాప్ తర్వాత ..?

Kajal-ram
2018-03-21 11:25:14

కొన్ని కాంబినేష‌న్స్ ఫ్లాప్ అయినా క్రేజ్ ఉంటుంది. అలాంటి జంటే కాజ‌ల్, రామ్. ఈ ఇద్ద‌రూ దాదాపు ఎనిమిదేళ్ల క్రితం గ‌ణేష్ అనే సినిమాలో క‌లిసి న‌టించారు. కానీ సినిమా డిజాస్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత వీరు క‌లిసి న‌టించాల‌ని కానీ, ఈ ఇద్దరితో సినిమా చేయాల‌ని కానీ ఎవ‌రూ అనుకోలేదు. దీంతో వీరి జంట మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌లేదు. కానీ ఇన్నాళ్లకు మ‌రోసారి రామ్ తో రొమాన్స్ కు ఓకే చెప్పింది కాజ‌ల్ అగ‌ర్వాల్. ప్ర‌స్తుతానికైతే మాట‌ల్లోనే ఉన్న ఈ జంట క‌థ‌.. ఆల్మోస్ట్ ఫైన‌ల్ అంటున్నారు. 

చిన్న సినిమాల‌తో మొద‌లుపెట్టి ఒక్క సినిమాతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీని అట్రాక్ట్  చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు. అత‌ను తీసిన గ‌రుడ‌వేగ చాలామంది ప్ర‌శంస‌లు పొందింది. నేష‌న‌ల్ అవార్డ్ సినిమా తీసిన‌ప్పుడు కూడా ప్ర‌వీణ్ కు ఇంత అప్లాజ్ రాలేదు. గ‌రుడ‌వేగ త‌ర్వాత చాలామంది పెద్ద హీరోలు ప్ర‌వీణ్ వైపు చూశారు. కానీ క‌థే ఫైన‌ల్ అనీ, ఆ క‌థ‌క స‌రిపోయే ఆర్టిస్టునే తీసుకోవ‌డం ప్ర‌వీణ్ స్టైల్. ఈ కార‌ణంగానే త‌న నెక్ట్స్ సినిమాకు రామ్ ను తీసుకున్నాడు. ఇది చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కానీ రాజశేఖ‌ర్ ను తీసుకున్న‌ప్పుడు క‌మెంట్ చేసిన వారు త‌ర్వాత సినిమా రిజ‌ల్ట్ తో ఖంగు తిన్నారు క‌దా. అందుకే ఈసారి ఎవ‌రూ బ‌య‌ట‌ప‌డలేదు. ఇదుగో ఈ మూవీలోనే రామ్ తో జోడీగా కాజ‌ల్ ను తీసుకోవాల‌నుకుంటున్నాడు ప్ర‌వీణ్. 

ప్ర‌స్తుతం రామ్, దిల్ రాజు క్యాంప్ లోఉన్నాడు. న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ మూవీ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌వీణ్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈ మ‌ధ్య వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న రామ్ కు దిల్ రాజు హిట్ఇస్తే ప్ర‌వీణ్ ఖ‌చ్చితంగా కొత్త  ఇమేజ్ ఇస్తాడు. మ‌రి ఆ త‌ర్వాతైనా హైపర్ చూపించ‌కుండా ఉంటే చాలు.. ఏదేమైనా రామ్, కాజ‌ల్ కాంబో కాస్త ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఎనిమిదేళ్ల త‌ర్వాత క‌లిసి న‌టించ‌బోతున్నారు కాబ‌ట్టి అప్ప‌టి ఫ్లాప్ ఇప్పుడు ప్ర‌భావం చూపిస్తుంద‌నుకోలేం. 

More Related Stories