English   

చిరు చిన్నల్లుడితో మేనల్లుడికి పాట్లు..!! 

vijetha-01
2018-07-07 21:09:29

అటు చూస్తే మేనల్లుడు.. ఇటు చూస్తే కూతురును ఇచ్చిన అల్లుడు. ఇద్దరి మధ్య మెగాస్టార్ చిరంజీవి ఎటు తేల్చుకుంటాడు.. అంటే ఈ నెల 12వరకూ ఆగాల్సిందే. ఈ విషయంలో సాయిధరమ్ తేజ్ కూడా హైరానా పడుతున్నాడు. యస్.. విజేత విజయం సాధిస్తే ఖచ్చితంగా ఈ సుప్రీమ్ హీరకు పాట్లు తప్పవు. అది నిజం. ఇప్పటికే వరుసగా ఐదు డిజాస్టర్స్ చూశాడు సాయిధరమ్ తేజ్. లేటెస్ట్ గా వచ్చిన తేజ్ ఐ లవ్యూ కూడా ఏమంత ఆకట్టుకోవడం లేదు. మరీ డిజాస్టర్ అనలేం.. అలాగని హిట్ అని కూడా చెప్పలేం. తేజ్ ఐ లవ్యూతో తేజూ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో మరోసారి విఫలమయ్యాడనేది మాత్రం ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతోన్న మాట. అందుకు తగ్గట్టుగానే సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు.

ఈ నేపథ్యంలో ఈ నెల 12న విడుదల కాబోతోన్న చిరంజీవి చిన్నల్లుడు విజేత తేజూకు కునుకు లేకుండా చేస్తోందంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలున్నారు. వారిలో అందరినీ ఆయన ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోలేరు. మొదట్లో వరుణ్ కంటే తేజూ స్పీడ్ మీదున్నట్టు కనిపించాడు. కానీ ఇప్పుడు వరుణ్ రేంజ్ పెరిగింది. తేజూ పరిస్థితి దిగజారింది. అందుకు కారణం సినిమాల జయాపజయాలే. ఇక కొత్త ఫ్లాప్ తో తేజూకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో విజేత విజయం సాధిస్తే ఖచ్చితంగా తేజూకు మైనస్ అవుతుంది. ఎలా చూసినా చిరంజీవికి చిన్న కూతురంటే చాలా ఇష్టం. ఇక ఆమె భర్త కళ్యాణ్ దేవ్ ను ఎంకరేజ్ చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేడు. అందుకే విజేత హిట్ అయితే కనుక మెగా ఫ్యాన్స్ లో చాలామంది తేజూ నుంచి కళ్యాణ్ కు మారతారు. పైగా తేజూ కంటే కళ్యాణ్ కాస్త బావుంటాడు కూడా.. కాబట్టి తేజ్ ఐ లవ్యూ పోయిందన్న బాధ కంటే సాయిధరమ్ తేజ్ కు విజేత విజయం సాధిస్తేనే ఎక్కువ ఇబ్బంది అనేది కాదనలేని నిజం.

More Related Stories