English   

 లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సూపర్ మచ్చి సినిమా?

super machi
2021-11-05 16:47:13

 మెగా ఫ్యామిలీ నుంచి హీరో గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మొదట విజేత సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంతేకాకుండా ఆ విజేత సినిమా తర్వాత ఇప్పటి వరకూ కళ్యాణ్ దేవ్ వీరే సినిమా చేయలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే సూపర్ మచ్చి, కిన్నెరసాని అనే సినిమాలను చేస్తున్నాడు.

 ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై, రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాకు తమన్ అందించిన ఐదు పాటలు బలం చేకూర్చనున్నాయి.

 ఇందులో రాజేంద్రప్రసాద్, ప్రగతి, నరేష్, అజయ్, పోసాని మురళి కృష్ణ, జబర్దస్త్ మహేష్, భద్రం, పృథ్వి పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోంది అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ టీజర్ కి కూడా ప్రేక్షకుల నుంచి భారీగానే స్పందన వచ్చింది.

More Related Stories