English   

 మెగాస్టార్ అల్లుడు విజేత‌.. 

kalyan-dev-vijetha

విజేత అంటే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది చిరంజీవి సినిమానే. 80ల్లో వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. అద్భుతమైన కుటుంబ క‌థా చిత్రంగా మ‌న్న‌న‌లు అందుకుంది విజేత‌. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ తో చిరంజీవి చిన్న‌ల్లుడు వ‌స్తున్నాడు. క‌ళ్యాణ్ దేవ్ హీరోగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న తొలి సినిమా సాయి కొర్ర‌పాటి నిర్మాణంలో జ‌రుగుతుంది. ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. 1985లో చిరంజీవి న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు అల్లుడు కూడా ఇదే టైటిల్ తో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అద‌ర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో స‌క్సెస్ అనేది ట్యాగ్ లైన్. అంటే ఇత‌రుల మొహాల్లో వెలుగు చూడ‌టం కూడా విజ‌య‌మే అని అర్థం. అందుకే ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ పెట్టారు. రాకేశ్ శశి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మాళ‌విక న‌య్య‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ మ‌ధ్యే డ‌బ్బింగ్ కూడా మొద‌లు పెట్టారు హీరో క‌ళ్యాణ్ దేవ్. బాహుబ‌లి ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌టం విశేషం. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ విజేత‌. ఈ చిత్రంలో నాజ‌ర్, త‌ణికెళ్ళ భ‌ర‌ణి, ముర‌ళి పోసాని లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కూడా ఉన్నారు. 

More Related Stories