English   

ఫ్యామిలీకి విరుద్ధంగా మెగా అల్లుడు..

Kalyan Dhev Vijetha Teaser
2018-06-12 10:04:52

ఇప్పుడు మెగా కుటుంబం నుంచి మ‌రో హీరో కూడా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే క‌దా. చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ సైతం ఇప్పుడు హీరో అయిపోతున్నాడు. ఈయ‌న ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. ఇక ఇప్పుడు టీజ‌ర్ కూడా వ‌చ్చేసింది. అయితే మెగా కుటుంబం అంటే ఎవ‌రికైనా గుర్తు వ‌చ్చేది మాస్ ఇమేజ్. ఈ కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలు కాస్త క‌ష్ట‌ప‌డితే చాలు ప్రేక్ష‌కులు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. రెండు హిట్లు ప‌డితే మాస్ ఇమేజ్ వ‌ద్ద‌న్నా వ‌చ్చేస్తుంది. ఇన్ని ప్లాపులు ఉన్నా కూడా సాయిధ‌రంతేజ్ ఇంకా అవ‌కాశాలు సాధిస్తున్నాడంటే దానికి కార‌ణం అత‌డి మాస్ ఇమేజ్. అయితే ఇప్పుడు క‌ళ్యాణ్ మాత్రం కొత్త‌గా ట్రై చేస్తున్నాడు. మెగా కుటుంబానికి అల‌వాటు లేని క్లాస్ ఇమేజ్ తో వ‌స్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క వ‌రుణ్ తేజ్ మాత్ర‌మే అలా కొత్త కొత్త‌గా ట్రై చేస్తూ త‌న దారిలో వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న‌కు తోడుగా క‌ళ్యాణ్ కూడా వ‌చ్చేసాడు. ఈ కుర్ర హీరో తొలి సినిమాతోనే క్లాస్ అండ్ ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. రాకేశ్ శ‌శి తెర‌కెక్కిస్తున్న విజేత సినిమాతో ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. సినిమా జులైలో విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. మెగా ఫ్యామిలీకి విరుద్ధ‌మైన ఇమేజ్ తో వ‌స్తున్న క‌ళ్యాణ్.. ఎంత‌వ‌ర‌కు మామ పేరు నిల‌బెడ‌తాడో..? 

More Related Stories