English   

మెగా అల్లుళ్ల పోరు ఇంతింత కాద‌యా..!

Kalyan-Dhev

మెగా హీరోలంటేనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తెలియ‌ని ద‌డ ఉంటుంది. వాళ్ల సినిమాల‌కు కాస్త పాజిటివ్ టాక్ వ‌స్తే చాలు కుమ్మేస్తుంటాయి. ఇక ఇప్పుడు ఇద్ద‌రు మెగా హీరోలు బాక్సాఫీస్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అది కూడా ఒక వారం గ్యాప్ లో. నిజానికి ఒకేరోజు చిరు అల్లుడు క‌ళ్యాణ్ దేవ్.. మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్ వ‌స్తార‌నుకున్నారంతా. కానీ ఈ వార్ ను చాలా తెలివిగా త‌ప్పించాడు చిరంజీవి. జులై 6న ఎప్ప‌ట్లాగే సాయిధ‌రంతేజ్ వ‌స్తున్నాడు. తేజ్ ఐ ల‌వ్ యూ సినిమా విడుద‌ల తేదీ ఎప్పుడో అనౌన్స్ చేసాడు నిర్మాత కేఎస్ రామారావు. జులై 6నే క‌ళ్యాణ్ దేవ్ విజేత కూడా రానుంద‌నే ప్ర‌చారం బానే జ‌రిగింది. దానికి కార‌ణం ఈగ విడుద‌ల తేదీ అది కావ‌డం. పైగా నిర్మాత సాయికొర్ర‌పాటికి అది సెంటిమెంట్ డేట్ కావ‌డంతో కాంప్ర‌మైజ్ కార‌నే అనుకున్నారంతా. కానీ చిరంజీవి మ‌ధ్య‌లో స‌యోధ్య కుదిర్చాడు. అల్లుళ్లు ఇద్ద‌రికి పోటీ త‌ప్పించాడు. చిన్న‌ల్లుడు సినిమాను వారం రోజులు పోస్ట్ పోన్ చేయించి.. జులై 12న ఫిక్స్ చేయించాడు. దాంతో ఇప్పుడు జులై 6న తేజ్.. 12న విజేత రానున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ అల్లుళ్ల పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో..?

More Related Stories