English   

క‌ళ్యాణ్ సూప‌ర్ ఫాస్ట్.. అప్పుడే ఇంకోటి..!

Kalyan-Ram

అంద‌గాడు.. కావాల్సినంత బ్యాగ్రౌండ్ ఉంది.. ఇమేజ్ కూడా ఉంది.. గుర్తింపు వ‌చ్చింది.. అయినా కూడా విజ‌యాలు రావ‌డం లేదు. ఓ వైపు త‌మ్ము డేమో సూప‌ర్ స్టార్ అయిపోయాడు. కానీ అన్న‌య్య మాత్రం ఇంకా 15 కోట్ల మార్కెట్ కూడా తెచ్చుకోలేదు. ఈ క‌ష్టాల‌న్నీ క‌ళ్యాణ్ రామ్ కే వ‌చ్చాయి ఇప్పుడు. ఈ మ‌ధ్యే నా నువ్వేతో మ‌రో డిజాస్ట‌ర్ అందుకున్నాడు ఈ హీరో. అస‌లు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు త‌న‌ను చూస్తారో తెలీక పాపం తిక‌మ‌క‌ప‌డుతున్నాడు ఈ హీరో. ఏ సినిమా చేసినా కూడా ఒక‌టే ఫ‌లితం వ‌స్తుండ‌టంతో క‌ళ్యాణ్ రామ్ లో ఫ్ర‌స్టేష‌న్ పెరిగిపోతుంద‌ని వార్త‌లొస్తున్నాయి.  మూడేళ్ల కింద ప‌టాస్ వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో స‌క్సెస్ రాలేదు ఈ హీరోకు. షేర్.. యిజం.. ఎమ్మెల్యే.. ఇప్పుడు నా నువ్వే.. ఇలా అన్ని సినిమాలు వ‌స్తున్నాయి పోతున్నాయి కానీ ఏదీ నిల‌బ‌డ‌టం లేదు. దాంతో క‌ళ్యాణ్ కు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ప్ర‌స్తుతం కేవీ గుహ‌న్ ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్న క‌ళ్యాణ్.. ద‌ర్శ‌కుడిగా ఏ మేర‌కు స‌త్తా చూపిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైందిప్పుడు. మ‌రోసారి సూప‌ర్ స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు నంద‌మూరి వార‌సుడు. ఈ చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా అనుకున్నా అది కూడా కొన్ని రోజులు ఆల‌స్య‌మ‌య్యేలా ఉంది. మ‌రి చూడాలిక‌.. గుహ‌న్ అయినా ఈ హీరోకు హిట్ ఇస్తాడో లేదో..?

More Related Stories