English   

సి.ఎమ్ కోసం వెళితే ఎమ్మెల్యే ఫీల‌వుతున్నాడా..?

ntr-kalyan

కొన్ని రిలేష‌న్స్ బ‌య‌టికి ఎలా ఉన్నా.. లోప‌ల స్ట్రాంగానే ఉంటాయి. కానీ చూసేవారికీ అవి బ‌లంగా ఉన్నాయా లేవా అనే అనుమానాలు పెరుగుతుంటాయి. ఇందుకు కార‌ణం వారి ప్ర‌వ‌ర్త‌నే. ముఖ్యంగా సినిమా సెల‌బ్ర‌టీస్ విష‌యంలో ప్ర‌తి విష‌యం భూత‌ద్దంలో చూస్తుంటారు చాలామంది. ఇప్పుడు ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ మేట‌ర్ కూడా అలాంటిదే. ఎన్టీఆర్ క‌ళ్యాణ్ రామ్ మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌నీ, అస‌లు ఈ త‌మ్ముడికి అన్న అక్క‌ర్లేద‌నీ చాలామంది రాస్తున్నారు. అందులో నిజ‌మెంత అనేది తెలియ‌దు కానీ.. నిన్న‌టి వ‌ర‌కూ కామ్ గా ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్య‌మంత్రి కోసం త‌మ్ముడు వెళుతోంటే మాత్రం ఫీల‌వుతున్నాడ‌నేది లేటెస్ట్ టాక్. 

ఈ మ‌ధ్య ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ సినిమా ఎమ్మెల్యే కోసం వెళ్ల‌లేదు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కే కాదు, స‌క్స‌స్ మీట్ కూ వెళ్ల‌లేదు. అప్పుడు వెళితే త‌న కొత్త సినిమా లుక్ రివీల్ అవుతుంది అని చెప్పారు. అది నిజ‌మే క‌దా అని చాలామంది అనుకున్నారు. కానీ ఆ త‌ర్వాత ఐపిఎల్ సీజ‌న్ 11 కోసం స్టార్ మాటివికి యాడ్స్ చేశాడు. అప్పుడు లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌రే అది క‌మ‌ర్షియ‌ల్ క‌దా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మ‌హేష్ బాబు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు వెళుతుండ‌టంతో ఇప్పుడు ఎమ్మెల్యే క‌ళ్యాణ్ రామ్ ఫీల‌వుతున్నాడ‌నేది కొంద‌రి వాద‌న‌. 

మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనేనేనులో ముఖ్యమంత్రిగా న‌టించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కోసం వెళుతున్నాడు ఎన్టీఆర్. ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద‌గా ప‌ట్టించుకోని క‌ళ్యాణ్ రామ్ ఈ విష‌యంలో ఇబ్బందిగా ఫీల‌వుతున్నాడ‌నేది ఇంట‌ర్న‌ల్ సోర్స్ చెబుతోన్న మాట‌. అయితే క‌ళ్యాణ్ రామ్ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు త‌మ్ముడుగా జూనియ‌ర్ పెద్ద సాయ‌మే చేశాడు. జై ల‌వకుశ సినిమా చేసి అత‌న్ని క‌ష్టాల్లో నుంచి గ‌ట్టెక్కించాడు అని చాలామంది చెబుతారు. కానీ ఈ విష‌య‌లో ఎన్టీఆర్ చేసిదల్లా అన్న‌కు డేట్స్ ఇవ్వ‌డ‌మే. ఆత‌ర్వాత త‌తంగాల‌న్నీ మామూలుగానే జ‌రిగాయి. అంటే ఓ స్టార్ హీరోగా త‌న రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించ‌లేదు. ఇంకా చెబితే కాస్త ఎక్కువే తీసుకున్నాడు అంటారు. అవ‌న్నీ ఎలాగూ వేరే హీరో చేసినా క‌ళ్యాణ్ ఇవ్వాలి కాబ‌ట్టి ఈ విష‌యం ప‌ట్టించుకోనక్క‌ర్లేదు. కానీ.. త‌న సినిమా ఫంక్ష‌న్ కోసం అస్స‌లు రాని త‌మ్ముడు ఇలా బ‌య‌టి సినిమా కోసం వెళుతుండ‌టం మాత్రం అన్న‌కు ఎలా ఉందో కానీ.. ఆ ఇద్ద‌రూ నిజంగానే క‌లిసిపోయారు అనుకున్న చాలామంది.. వీరికి చెడిందా అనుకుంటున్నారు. సో.. ముఖ్య‌మంత్రి కోసం వెళితే ఈ ఎమ్మెల్యేగారు ఫీలవుతున్నారా లేదా అనేది పక్క‌న బెడితే ఫీల‌వుతున్నాడేమో అనుకునేవారే ఎక్కువ‌గా ఉన్నారు.

More Related Stories