English   

నంద‌మూరి కుటుంబం క‌లిసిపోయిందే..!

Kalyan-Ram
2018-03-29 13:50:48

కొన్నేళ్లుగా నంద‌మూరి కుటుంబంలో తెలియ‌ని వివాదాలు అయితే ఉన్నాయి. హ‌రికృష్ణ కుటుంబం ఓవైపు.. బాల‌య్య కుటుంబం మ‌రోవైపు.. వీరి మ‌ధ్య మాట‌లు కూడా స‌రిగ్గా లేవు. అబ్బాయిలు బాబాయ్ బాబాయ్ అన‌డం త‌ప్ప‌.. బాబాయ్ మాత్రం ఎప్పుడూ అబ్బాయ్ అన‌లేదు. ఎంత‌సేపు క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్ర‌మే బాల‌య్య‌తో ప్రేమ‌గా ఉన్నారు. కానీ ఈయ‌న మాత్రం కాస్త క‌ఠువుగానే ఉన్నారు. అప్ప‌ట్లో బాల‌య్య చిన్న కూతురి పెళ్లికి ఎన్టీఆర్ రాలేదు కూడా. అయితే ఇప్పుడు అవ‌న్నీ అన్న‌గారి పుణ్య‌మా అని మ‌రిచిపోయారు నంద‌మూరి కుటుంబం. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఓపెనింగ్ లో క‌ళ్యాణ్ రామ్ క‌నిపించాడు. కానీ ఎన్టీఆర్ రాలేదు. దానికి కార‌ణం కూడా ఒక్క‌టే లుక్ బ‌య‌టికి రాకూడ‌ద‌ని. అంతేకానీ బాబాయ్ పై ప్రేమ లేక కాదు.. తాత‌పై అభిమానం లేక కాదు..! హ‌రికృష్ణ కుటుంబం త‌ర‌ఫున క‌ళ్యాణ్ రామ్ వ‌చ్చాడు. అయితే బాబాయ్ తో మాత్రం క‌ల‌వ‌లేదు ఈ హీరో. తాత‌య్య బ‌యోపిక్ కాబ‌ట్టి వార‌సుల్ని కూడా పిల‌వాల‌ని ముందే ఫిక్స‌య్యాడు బాల‌య్య‌. అందుకే క‌ళ్యాణ్ రామ్ క‌నిపించాడు. మొత్తంగా అతిర‌థ మ‌హార‌థుల మ‌ధ్య‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్ కు ముహూర్తం పెట్టాడు బాల‌కృష్ణ‌. వ‌చ్చే సంక్రాంతికి అన్న‌గారి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More Related Stories