English   

బాల‌య్య సినిమాలో క‌ళ్యాణ్ రామ్.. 

NTR-Biopic

నంద‌మూరి హీరోలు క‌లిసి న‌టిస్తే చూడాల‌ని చాలా కాలంగా అభిమానులు చూస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ స‌మ‌యం మాత్రం రావ‌ట్లేదు. అది ఎప్పుడొస్తుందో కూడా తెలియ‌డం లేదు. కానీ ఇప్పుడు ఆ పెద్దాయ‌న ద‌య వ‌ల్లే నంద‌మూరి కుటుంబం క‌లిసేలా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ కు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు బాల‌య్య‌. ఈయ‌నే ఈ చిత్రానికి నిర్మాత కూడా. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్ర షూటింగ్ మే నుంచి మొద‌లు కానుంది. ఇదే ఏడాది ద‌స‌రాకు సినిమా విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య మాత్ర‌మే క‌న్ఫ‌ర్మ్ అయ్యాడు. ఇంకా ఏయే పాత్ర‌ల్లో ఎవ‌రెవ‌రు న‌టించ‌బోతున్నార‌నేది క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఓ పాత్ర‌పై మాత్రం క్లారిటీ వ‌చ్చింది. ఇందులో హ‌రికృష్ణ‌గా ఆయ‌న త‌న‌యుడు క‌ళ్యాణ్ రామ్ న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో హ‌రికృష్ణ పాత్ర అతి ముఖ్య‌మైన‌ది. ఏడాది పాటు ఇంటిని వ‌దిలేసి.. పిల్ల‌ల్ని వ‌దిలేసి.. తండ్రి కోస‌మే తిరిగాడు హ‌రికృష్ణ‌. ఆయ‌న చైత‌న్య‌ర‌థాన్ని తోలిన సార‌థి హ‌రికృష్ణే. ఇప్పుడు ఈ పాత్ర‌లో కళ్యాణ్ రామ్ ను తీసుకుంటున్నాడు తేజ‌. ఈయ‌న‌కు క‌ళ్యాణ్ కు మంచి స్నేహం ఉంది. ల‌క్ష్మీక‌ళ్యాణం సినిమా క‌లిసి చేసారు తేజ‌, క‌ళ్యాణ్ రామ్. పైగా ఇప్పుడు బాల‌య్య‌ను కూడా ఒప్పిస్తున్నాడు తేజ‌. నిజానికి క‌ళ్యాణ్ రామ్ తో బాల‌య్య‌కు ఎలాంటి విభేదాలు లేవు. ఉన్న‌ద‌ల్ల ఎన్టీఆర్ తోనే. అందుకే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో జూనియ‌ర్ ను ఊహించ‌డం క‌ష్ట‌మే. కానీ ఇదే సినిమాలో నారా రోహిత్.. తారకరత్నలు కూడా న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. పెద్దాయ‌న బ‌యోపిక్ ఎలా ఉండబోతుందో..? 

More Related Stories