English   

కళ్యాణ్ రామ్ కు జాక్ పాట్

kalyan ram

ఇండస్ట్రీకి శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ వరంగా మారాయి. వీటివల్ల పెద్ద హీరోల సినిమాలకు భారీ లాభాలొస్తుంటే...మీడియం రేంద్ ఉన్న హీరోల సినిమాలు నష్టాలనుంచి బయటపడుతూ ఓ మాదిరి లాభాలు తెచ్చుకుంటున్నాయి. పోటీ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా రిజల్ట్ కూడా తెలియకుండానే రైట్స్ తీసుకుంటున్నారు. లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకి ప్రీ రిలీజ్ ఊహించినదానికంటే ఎక్కువగా జరిగింది. గత సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ మధ్య మన తెలుగు సినిమాలకు బిజినెస్ జరుగుతోంది. ఇందులో డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. సినిమా మీద కాస్తంత పాజిటివ్ బజ్ ఉంటే చాలు ప్రీ రిలీజ్ బిజినెస్ లో కోట్లు వచ్చేస్తున్నాయి. కెరీర్ లో ఇంకా భారీ విజయాల కోసం ప్రయత్నాలు చేస్తోన్న హీరో కళ్యాణ్ రామ్ సినిమాకు ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించినదానికంటే ఎక్కువే జరిగింది.

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తన్న కొత్త సినిమా ఎమ్.ఎల్.ఎ. శ్రీను వైట్ల దగ్గర ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి, డైలాగ్స్ కూడా  అంధించిన రచయిత ఉపేంద్ర  ఈ చిత్రంతో దర్శకుడుగా మారుతున్నాడు. ఎమ్.ఎల్.ఎ అనే పేరుతో మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు భలే డీల్ దక్కింది. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ తో పాటు థియేట్రికల్ రైట్స్ అన్నీకలిపి విడుదలకు ముందే 20 కోట్ల బిజినెస్ చేసిందట ఈ సినిమా. నిజానికి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఏ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగలేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ మధ్య కాలంలో పటాస్ తప్పితే మరో సినిమాతో హిట్టు కొట్టకపోయినా కూడా..ఎమ్.ఎల్.ఎ చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది. ఇక కళ్యాణ్ రామ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటిస్తోంది. ఆ మధ్య రిలీజైన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాని సమ్మర్ కానుకగా మార్చి 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 

More Related Stories