English   

క‌ళ్యాణ్  మొద‌లుపెట్టాడు బాబోయ్..!

kalyn-ram-guhan
2018-05-03 19:49:09

క‌ళ్యాణ్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదండీ బాబూ.. ఆయ‌న సినిమాల‌కు పూర్తిగా దూర‌మైపోయాడు. ఇక ఇప్పుడు ఆయ‌న నుంచి రాజ‌కీయాలే ఊహించాలి కానీ సినిమాలు కాదు. ఇక్క‌డ క‌ళ్యాణ్ అంటే క‌ళ్యాణ్ రామ్. ఈయ‌న మ‌రో సినిమా షూటింగ్ కూడా మొద‌లుపెట్టేసాడు. మొన్నే కొత్త సినిమాకు క్లాప్ కొట్టాడు.. అప్పుడే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇన్నేళ్ల‌లో ఇప్పుడు చేస్తున్నంత వేగంగా ఎప్పుడూ సినిమాలు చేయ‌లేదు క‌ళ్యాణ్ రామ్. కార‌ణం ఏంటో తెలియ‌దు కానీ వ‌ర‌స‌గా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఈ మ‌ధ్యే ఎమ్మెల్యేగా వ‌చ్చాడు క‌ళ్యాణ్. అది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఇక 180 ఫేమ్ జ‌యేంద్ర‌తో చేస్తోన్న నా నువ్వే షూటింగ్ స‌మ్మ‌ర్ లోనే విడుద‌ల కానుంది. ఇందులో త‌మ‌న్నాతో రొమాన్స్ చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మ‌రో రెండు సినిమాలు ఫైన‌ల్ చేసాడు ఈ హీరో. 
ఇప్ప‌టికే ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేమ్ ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా క‌మిట‌య్యాడు క‌ళ్యాణ్ రామ్. ఇందులో ఎన్టీఆర్, హ‌రికృష్ణ కూడా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. ఇక ఇప్పుడు విరించివ‌ర్మ‌తో ఓ సినిమాకు సైన్ చేసాడు ఈ హీరో. జెమిని కిర‌ణ్ ఈ చిత్రానికి నిర్మాత‌. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ పైకి రాలేదు కానీ అప్పుడే గుహ‌న్ సినిమాను మాత్రం ప‌ట్టాలెక్కించాడు. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తుండ‌టం విశేషం. ఈయ‌న ఇప్ప‌టికే క‌ళ్యాణ్ రామ్ తో నా నువ్వే నిర్మిస్తున్నాడు. అది విడుద‌ల కాక‌ముందే మ‌రో సినిమాకు సైన్ చేసాడు ఈ హీరో. గుహ‌న్ సినిమాలో నివేదా థామ‌స్, శాలిని పాండే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు నంద‌మూరి ప‌టాస్ జోరు మాత్రం మామూలుగా లేదు. ఇవ‌న్నీ హిట్ అయితే ఎన్నాళ్లుగానో క‌ళ్యాణ్ రామ్ కోరుకుంటున్న స్టార్ ఇమేజ్ వ‌చ్చేసిన‌ట్లే.

More Related Stories