English   

బాబూ క‌ళ్యాణ్.. ఏంట‌మ్మా ఈ జోరు..?

Kalyan-Ram
2018-04-25 12:14:20

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి కూడా 13 ఏళ్లు దాటేసింది. ఈ గ్యాప్ లో చాలా సినిమాలే చేసాడు. కానీ న‌టుడిగా క‌ళ్యాణ్ రామ్ ప‌ర్ఫార్మెన్స్ ను ఛాలెంజ్ చేసే పాత్ర మాత్రం ఒక్క‌టీ రాలేదు. అన్నీ రొటీన్ మాస్ కారెక్ట‌ర్లే. దాంతో ఇప్పుడు త‌న‌ను తాను మార్చుకునే ప‌నిలో బిజీగా ఉన్నాడు క‌ళ్యాణ్ రామ్. రెండేళ్ల కింద‌ ఆయ‌న చేసిన యిజం సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ న‌టుడిగా ఈ చిత్రం క‌ళ్యాణ్ రామ్ కు మంచి పేరే తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈయ‌న నాలుగు సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో ఎప్పుడూ లేనంత జోరు చూపిస్తున్నాడు ఈ హీరో. ఎందుకో తెలియ‌దు కానీ వ‌ర‌స‌గా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఈ మ‌ధ్యే ఎమ్మెల్యేగా వ‌చ్చాడు క‌ళ్యాణ్. అది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఇక 180 ఫేమ్ జ‌యేంద్ర‌తో చేస్తోన్న నా నువ్వే షూటింగ్ స‌మ్మ‌ర్ లోనే విడుద‌ల కానుంది. ఇందులో త‌మ‌న్నాతో రొమాన్స్ చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మ‌రో రెండు సినిమాలు ఫైన‌ల్ చేసాడు ఈ హీరో.

ఇప్ప‌టికే ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేమ్ ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా క‌మిట‌య్యాడు క‌ళ్యాణ్ రామ్. ఇందులో ఎన్టీఆర్, హ‌రికృష్ణ కూడా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. ఇక ఇప్పుడు విరించివ‌ర్మ‌తో ఓ సినిమాకు సైన్ చేసాడు ఈ హీరో. జెమిని కిర‌ణ్ ఈ చిత్రానికి నిర్మాత‌. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు సినిమాటోగ్ర‌ఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శ‌కుడిగా మ‌రో సినిమాకు సైన్ చేసాడు క‌ళ్యాణ్ రామ్. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తుండ‌టం విశేషం. ఈయ‌న ఇప్ప‌టికే క‌ళ్యాణ్ రామ్ తో నా నువ్వే నిర్మిస్తున్నాడు. అది విడుద‌ల కాక‌ముందే మ‌రో సినిమాకు సైన్ చేసాడు ఈ హీరో. గుహ‌న్ సినిమాలో నివేదా థామ‌స్, శాలిని పాండే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు నంద‌మూరి ప‌టాస్ జోరు మాత్రం మామూలుగా లేదు. ఇవ‌న్నీ హిట్ అయితే ఎన్నాళ్లుగానో క‌ళ్యాణ్ రామ్ కోరుకుంటున్న స్టార్ ఇమేజ్ వ‌చ్చేసిన‌ట్లే.

More Related Stories