English   

ప్రివ్యూ: ఎమ్మెల్యే

Kalytan-Ram-MLA
2018-03-22 17:24:25

ఎమ్మెల్యే.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. ఇదివ‌ర‌కు ఎమ్మెల్యే అంటే రాజ‌కీయ నాయ‌కులు గుర్తొచ్చేవాళ్లు. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ గుర్తొస్తున్నాడు. మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు ఈ నంద‌మూరి ప‌టాస్. కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్ గా న‌టించింది. మార్చ్ 23న సినిమా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్స్.. పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో సినిమా కూడా బాగానే ఆడుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడు క‌ళ్యాణ్ రామ్. పైగా ఈ చిత్రం త‌న‌కు ప‌టాస్ స్థాయి విజ‌యం తీసుకొస్తుంద‌ని ధీమాగా చెబుతున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఓ కుర్రాడు రాజ‌కీయ నాయ‌కుడిని స‌వాల్ చేసి ఎలా ఎమ్మెల్యే అయ్యాడు అనేది ఈ చిత్ర క‌థ‌. దీన్నే కాస్త సందేశాత్మ‌కంగా కూడా చెప్పాడు ఉపేంద్ర మాధవ్. ఇందులో విద్యావ్య‌వ‌స్థ‌ను కూడా చూపిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. మ‌ణిశ‌ర్మ సంగీతం సినిమాకు ప్ల‌స్ కానుంది. యుఎస్ లో మార్చ్ 22 రాత్రే భారీగా ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి 300 షోస్ ప్లాన్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూట‌ర్లు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 22 కోట్లు జ‌రిగింది. అంటే క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ కొట్టాలి ఎమ్మెల్యే సేఫ్ అవ్వాలంటే. మ‌రి చూడాలిక‌.. ఈ నంద‌మూరి హీరో ఏం చేస్తాడో..? ఏం చేయ‌బోతున్నాడో..? 

More Related Stories