English   

ఎమ్మెల్యే కు పోటీ పెరుగుతోంది.. 

Kalyan-Ram-MLA

ఎమ్మెల్యే( మంచి లక్షణాలున్న అబ్బాయి) అంటే ఎంత హడావిడీ చేయాలి. అందరికంటే ఎంత భిన్నంగా ఉండాలి. కానీ అవేవీ లేకుండానే కళ్యాణ్ రామ్ నిదానంగా వస్తున్నాడు. టీజర్ తో కొంత ఆకట్టుకన్నారు. కానీ అది మర్చిపోయారు జనం. దీంతో ఎమ్మెల్యే సినిమాలోని ఓ లిరికల్ సాంగ్ ను ఆ మధ్య విడుదల చేశారు. ఆ తర్వాతే ఎమ్మెల్యేను ఈ నెల 23న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. లేటెస్ట్ గా ఈ మూవీలోని మరో లిరికల్ సాంగ్ ను రేపు ఉదయం విడుదల చేయబోతున్నారు. ఎమ్మెల్యేకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. అతనొక్కడే తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. అలాగే కాజల్ తెలుగు తెరకు పరిచయం అయింది కళ్యాణ్ రామ్ తోనే. మళ్లీ ఇన్నాళ్లకు కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తుందీ చందమామ.

అయితే మొదట్లో ఎమ్మెల్యేకు పెద్దగా పోటీ ఉండదనుకున్నారు. కానీ ఆల్రెడీ నీదీనాదీ ఒకే కథ చిత్రాన్ని అదే రోజు విడుదల చేయబోతున్నట్టు ఆ మూవీ టీమ్ ప్రకటించింది. లేటెస్ట్ గా రాజరథం చిత్రం కూడా అదే రోజు రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. రాజరథం వెనక రానా ఉన్నాడు. కాబట్టి థియేటర్స్ విషయంలో కొంత వరకూ ఇబ్బంది ఎదురుకావొచ్చు. ఇక నీదీనాదీ ఒకే కథపై ముందు నుంచి భారీ హైప్ ఉంది. ముందు నుంచీ ప్లాన్డ్ గా వెళుతూ నీదీనాదీ ఒకే కథ చాలామందికి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఎమ్మెల్యేపై ఒత్తిడి పెరగుతున్నట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇంత వరకూ ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్ట్ పెంచే అంశం ఒక్కటీ రాలేదు. మోస్ట్ వాంటెడ్ అబ్బాయి అనే పాట కూడా పెద్దగా హిట్ కాలేదు. రేపు రాబోతోన్న పాటతో ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో కానీ.. చేసినా అది సరిపోదు. అందుకే సినిమా ఇలా ఉంటుంది.. అనేలా ఓ ఖచ్చితమైన టీజర్ లేదా ట్రైలర్ నో రిలీజ్ చేస్తే తప్ప కాంపిటీషన్ లో అతనెంత స్ట్రాంగ్ గా ఉంటాడనేది అంచనా వేయలేం. మొత్తానికి రేపు ఉదయం విడుదల చేయబోతోన్న పాటతో పాటు ఇంకేదైనా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉంటే బావుంటుందేమో.

More Related Stories