English   

 నాన్నా.. నాతో రాజ‌కీయాలొద్దంటోన్న క‌ళ్యాణ్.. 

Kalyan-Ram- MLA

క‌ళ్యాణ్ అంటే ప‌వ‌న్ కళ్యాణ్ కాదు.. క‌ళ్యాణ్ రామ్. ఈయ‌న కూడా ఇప్పుడు రాజ‌కీయాల గురించి మాట్లాడేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తోన్న సినిమానే పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తుంది. ఎమ్మెల్యేలో మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయిగానే కాదు.. ఎమ్మెల్యేగా కూడా మారిపోతున్నాడు. ఓ రాజ‌కీయ నాయ‌కుడితో స‌వాల్ చేస్తూ.. నేనింకా రాజ‌కీయాలు చేయ‌డం మొద‌లుపెట్ట‌లేదు.. చేస్తే మీకు చేయ‌డానికి ఏం ఉండ‌వంటూ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ ఒక‌టి చెప్పాడు ఈ హీరో. ఇది నిజంగానే త‌న శ‌త్రువులకు వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా ఉంది. ఇప్పుడు నంద‌మూరి కుటుంబంలోనే బాల‌య్య‌తో హ‌రికృష్ణ కుటుంబానికి ప‌డ‌ట్లేదు. ఇప్పుడు ఈయ‌న చెప్పిన డైలాగ్ చూస్తుంటే వాళ్ల‌కు సెటైర్ వేసిన‌ట్లుగా అనిపిస్తుంది. సినిమాను ఉద్ధేశించి అన్న డైలాగే అయినా కూడా ఇప్పుడు కావాల్సినంత ర‌చ్చ చేస్తుంది. ప‌టాస్ త‌ర‌హాలోనే ఈ చిత్రం కూడా సైలెంట్ కిల్ల‌ర్ అవుతుందేమో అనిపిస్తుంది ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత‌. కాజ‌ల్ కారెక్ట‌ర్ ఈ చిత్రంలో చ‌దువు గురించి చెప్పే విధంగా ఉంటుంది. విద్యావ్య‌వ‌స్థ గురించి కూడా డిస్క‌స్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్. ల‌క్ష్మీక‌ళ్యాణం త‌ర్వాత కాజ‌ల్ మ‌రోసారి క‌ళ్యాణ్ రామ్ తో న‌టించింది. అన్ని హంగుల‌తో మార్చ్ 23న వ‌చ్చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. మ‌రి ఈయ‌న చేయ‌బోయే రాజ‌కీయాలు ఎలా ఉండ‌బోతున్నాయో..?

More Related Stories