English   

బాబోయ్.. కళ్యాణ్ రామ్.. ఏంటిది..?

Kalyan-Ram
2018-04-15 18:20:06

నందమూరి కళ్యాణ్ రామ్.. ఏ ముహూర్తంలో పటాస్ చేశాడో కానీ.. ఆ తర్వాత అతని కెరీర్  కూడా పటాస్ లానే దూసుకుపోతోంది. సక్సస్ ల సంగతి పక్కన బెడితే తన బ్యానర్ లో కాకుండా ఇతర బ్యానర్స్ లో విపరీతమైన ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఎమ్మెల్యే ఫర్వాలేదనిపించింది. మే నెలలో నా నువ్వే విడుదల కాబోతోంది. నా నువ్వేలో తొలిసారిగా లవర్ బాయ్ గా రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ మూవీతో ఫస్ట్ టైమ్ తమన్నాతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇది కాక ఇప్పుడు లేటెస్ట్ గా మరో సినిమా ఓకే చేశాడు. అది కూడా ఈ యేడాదే విడుదలవుతుందనేది వేరే చెప్పక్కర్లేదు. 

కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఒక లిమిటెడ్ బడ్జెట్ లో కంఫర్టబుల్ హీరో అయిపోయాడు. అందుకే చాలామంది కొత్తవారు అతన్ని అప్రోచ్ అవుతున్నారు. లేటెస్ట్ గా ఓ సినిమాటోగ్రాఫర్ తను దర్శకుడుగా పరిచయం కావాలనుకుని ఫస్ట్ కళ్యాణ్ రామ్ కు కథ చెప్పాడు. అతను ఒకే చెప్పాడు. కట్ చేస్తే ఆ సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఇంతకీ అతనెవరో చెప్పలేదు కదూ.. గుహన్. సినిమాటోగ్రాఫర్ గా గుహన్ కు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి దర్శకుడు కావాలనుకోవడం, ఆ ఫస్ట్ ఛాన్స్ కళ్యాణ్ రామ్ ఇవ్వడం.. చూస్తే అతను కూడా సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి లా మంచి దర్శకుడు అయ్యే తీరతాడనే సంకేతాలు పంపిస్తోంది. పైగా సినిమాటోగ్రాఫర్స్ కు దర్శకత్వంపై మంచి క్లారిటీ ఉంటుంది.
 
థ్రిల్లర్ జానర్ లో సాగే ఈ కథకు హీరోయిన్లు కూడా ఫైనల్ కావడమే ఇప్పుడు అసలైన సర్ ప్రైజ్. అర్జున్ రెడ్డితో ఆకట్టుకున్న బ్యూటీ షాలినీ పాండే తో పాటు టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నివేదా థామస్ కూడా ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన రొమాన్స్ చేయబోతున్నారు. సో.. అదీ మేటర్.. ఈ యేడాది ఇప్పటికే ఓ సినిమా వచ్చేసింది. మరో సినిమా రాబోతోంది. నెక్ట్స్ ఈ మూవీ కూడా ఈ యేడాదే విడుదలవుతుంది. మరి ఇదంతా చూస్తే కళ్యాణ్ రామ్.. ఏంటీ స్పీడ్ అనిపించకమానదు.. కదా.. 

More Related Stories