English   

క‌ళ్యాణ్ రామ్ రేంజ్ అంత దారుణ‌మా..? 

Kalyan-Ram
2018-06-28 12:26:00

సినిమా ఎంత పెద్ద డిజాస్ట‌ర్ అయినా కూడా క‌నీసం 3-4 కోట్లైనా రావాలి క‌దా. ఎందుకంటే ఆ హీరోకు ఉన్న మార్కెట్ అలాంటిది మ‌రి. ఇక్క‌డ మ‌నం మాట్లాడుకుంటున్న హీరో క‌ళ్యాణ్ రామ్. నంద‌మూరి కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ వార‌సుడికి మార్కెట్ 10 కోట్ల వ‌ర‌కు ఉంది. అయితే హిట్టైతే కానీ  ఆ మార్క్ అందుకోద‌న్న‌మాట‌. ప‌టాస్ హిట్టై 20 కోట్లు దాటేసింది. కానీ ఆ త‌ర్వాత అస‌లు ఆట మొద‌లైంది. షేర్.. యిజం.. ఎమ్మెల్యే ఫ్లాప‌య్యాయి. అయితే ఈ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా డిజాస్ట‌ర్ కా బాప్ అన‌డానికి మాత్రం లేదు. ఎమ్మెల్యే ఫ్లాప్ అయినా కూడా 8 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. క‌ళ్యాణ్ రామ్ కు ఇది ఎక్కువే. కానీ మొన్న విడుద‌లైన నా నువ్వే మాత్రం కోటిన్న‌ర ద‌గ్గ‌రే త‌న ప్ర‌యాణం ముగించేసింది. దాన్ని బ‌ట్టే క‌ళ్యాణ్ రామ్ మార్కెట్ ఎంత వీక్ అని అర్థ‌మైపోయింది. అస‌లు తొలిరోజు త‌ర్వాత ఈ చిత్రం చూడ్డానికి ప్రేక్ష‌కులు క‌నీసం ఆస‌క్తి కూడా చూపించ లేదు. ఈ డిజాస్ట‌ర్ ను క‌ళ్యాణ్ రామ్ కూడా ప‌ర్స‌న‌ల్ గానే తీసుకున్నాడు. అస‌లు త‌న‌కేం చేస్తే హిట్ వస్తుందో తెలియ‌క జుట్టు పీక్కుంటున్నాడు. మ‌రి ఈయ‌న క‌ష్టాన్ని తీర్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో ఏమో..? 

More Related Stories