English   

జూన్ 1 చాలా హాట్ గురూ..

Nela-Ticket
2018-05-23 19:30:39

కొంతకాలంగా మన సినిమావాళ్లు ప్రారంభం టైమ్ లోనే రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారు. అయితే కొన్నిసార్లు అదే టైమ్ కు రిలీజ్ చేయడం కుదరదు. దీంత వాయిదా వేసుకుంటారు. మరో డేట్ చూసుకుంటారు. అయితే ఈ సారి ఏకంగా ఇలా పోస్ట్ పోన్ అయిన నాలుగు సినిమాలూ ఒకే రోజు వస్తున్నాయి. ఆ నాలుగు సినిమాలూ ముందు చెప్పిన డేట్ దాటుకుని ఫైనల్ మళ్లీ ఒకే డేట్ కు రాబోతున్నాయి. కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన సినిమా నా నువ్వే.జయేంద్ర దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ఈ మూవీకి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఆ బ్రిలియన్సీ అంతా మనకు ట్రైలర్ లో తెలిసిపోయింది. కళ్యాణ్ రామ్, తమన్నా ఇంతకు ముందెప్పుడూ కనిపించనంత రొమాంటిక్ గా ఉన్నాడీ సినిమాలో. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయాలనుకున్నారు. అందుకు తగ్గట్టుగా కొంత హడావిడీ కూడా చేశారు. కానీ సడెన్ గా ఈ మూవీ 25న రావడం లేదని చెప్పారు. ఫైనల్ గా జూన్ 1న డేట్ ఫిక్స్ చేసుకున్నారు. 
 
ఈనెల 25నే రావాల్సిన మరో సినిమా ఆఫీసర్. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో గోవిందా గోవిందా తర్వాత వస్తోన్న సినిమా ఇది. దీంతో సహజంగానే అంచనాలుండాలి. కానీ అవేం కనిపించడం లేదు. పైగా ఈ మధ్య వర్మ కొత్త పంచాయితీలు పెట్టుకోవడంతో అవి కూడా ఈ సినిమా రిలీజ్ పై ప్రభావం చూపించాయి. మొత్తంగా పెద్దగా క్రేజ్ లేకుండానే ఆఫీసర్ కూడా జూన్ 1న ఆడియన్స్ ముందు రిపోర్ట్ చేయబోతున్నాడు.  నిజానికి నానువ్వే, ఆఫీసర్ రెండు సినిమాలూ ముందుగా మే 25డేట్ నే ఫిక్స్ చేసుకున్నాయి. లేట్ అయినా మళ్లీ ఒకే రోజు వస్తుండటం విశేషం. 

 ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన రాజుగాడు కూడా జూన్ 1నే వస్తున్నాడు. చాలాకాలంగా ఓ హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా ఇది. అమైరా దస్తూర్  హీరోయిన్. తనకు తెలియకుండానే దొంగతనాలు చేసే వింత జబ్బుతో బాధపడే కుర్రాడి పాత్రలో నటించాడు రాజ్ తరుణ్. సంజనా రెడ్డి అనే లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 1న వస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఏ క్రేజ్ రాని రాజుగాడు ఇంత కాంపిటీషన్ లో దూరడే ఆశ్చర్యంగా ఉందంటున్నారు చాలామంది. మరి ఈ పోటీలో ఈ క్రేజీ దొంగ నిలుస్తాడా లేదా అనేది చూడాలి. 

ఇక జూన్ 18న విడుదల కావాల్సిన సినిమా అభిమన్యుడు. విశాల్, యాక్షన్ కింగ్ అర్జున్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఆల్రెడీ ఈనెల 11న తమిళనాడులో విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పుడు 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో అభిమన్యుడు కూడా జూన్ 1న బాక్సాఫీస్ వ్యూహంలోకి దిగబోతున్నాడు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినంత మాత్రాన ఇక్కడా హిట్ అవుతుందనుకోలేం. ఎందుకంటే అక్కడ హిట్ అయిన చాలా సినిమాలు చాలాసార్లు మనవాళ్లకు నచ్చలేదు. అందుకే అభిమన్యుడు కూడా త్వరలోనే ప్రమోషన్స్ బరిలోకి దిగబోతున్నాడు.

పోస్ట్ పోన్ అయిన సినిమ అని చెప్పలే కానీ మంచు లక్ష్మి కొత్త సినిమా వైఫ్ ఆఫ్ రామ్ కూడా జూన్ 1నే విడుదల కాబోతోంది. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. టీజర్ అవీ బానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. మంచు లక్ష్మీ ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది. మొత్తంగా పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ ఒకే డేట్ కు రావడం ఈ మధ్య కాలంలే ఇదే ఫస్ట్ టైమ్. అనుకోకుండా వచ్చినా అందరూ కలిసే వచ్చారు కాబట్టి.. ఖచ్చితంగా అందరికీ పోటీ ఉంటుంది. మరి ఈ పోటీలో గెలిచేదెవరో.. నిలిచేదెవరో కానీ.. ఎవ్వరికీ పూర్తి స్థాయి మెజార్టీ రాదనేది బాక్సాఫీస్ ఫార్ములాస్ తెలిసిన ఎవరైనా చెబుతారు.. 
 

More Related Stories