English   

 ఈ సారి కొట్ట‌క‌పోతే క‌ష్ట‌మే క‌ళ్యాణ్..

Kalyan-Ram
2018-07-06 11:18:38

అంద‌గాడు.. కావాల్సినంత బ్యాగ్రౌండ్ ఉంది.. ఇమేజ్ కూడా ఉంది.. గుర్తింపు వ‌చ్చింది.. అయినా కూడా విజ‌యాలు రావ‌డం లేదు. ఓ వైపు త‌మ్ము డేమో సూప‌ర్ స్టార్ అయిపోయాడు. కానీ అన్న‌య్య మాత్రం ఇంకా 15 కోట్ల మార్కెట్ కూడా తెచ్చుకోలేదు. ఈ క‌ష్టాల‌న్నీ క‌ళ్యాణ్ రామ్ కే వ‌స్తున్నాయిప్పుడు. ఈయ‌న తాజా సినిమా నా నువ్వే కూడా ఫ్లాప్ అయింది. అస‌లు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు త‌న‌ను చూస్తారో తెలీక పాపం తిక‌మ‌క‌ప‌డుతున్నాడు ఈ హీరో. ఏ సినిమా చేసినా కూడా ఒక‌టే ఫ‌లితం వ‌స్తుండ‌టంతో క‌ళ్యాణ్ రామ్ లో ఫ్ర‌స్టేష‌న్ పెరిగిపోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లు సినిమాల‌కు బ్రేక్ కూడా ఇవ్వాల‌ని అనుకున్నా కూడా ఇప్ప‌టికే వ‌ర‌స సినిమాల‌కు క‌మిటవ‌డంతో కంటిన్యూ అవుతున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం సినిమాటోగ్ర‌ఫ‌ర్ కేవీ గుహ‌న్ ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సినిమా చేస్తున్నాడు క‌ళ్యాణ్. ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది.. ఈ మ‌ధ్యే ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. మూడేళ్ల కింద ప‌టాస్ వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో స‌క్సెస్ రాలేదు ఈ హీరోకు. షేర్.. యిజం.. ఎమ్మెల్యే.. ఇప్పుడు నా నువ్వే.. ఇలా అన్ని సినిమాలు వ‌స్తున్నాయి పోతున్నాయి కానీ ఏదీ నిల‌బ‌డ‌టం లేదు. దాంతో క‌ళ్యాణ్ కు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా త‌ర్వాత ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా ఒప్పుకున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఈ నంద‌మూరి వార‌సుడికి ఏం చేస్తే హిట్ వ‌స్తుందో..?

More Related Stories