English   

ఆ ఎమ్మెల్యేకు ఏదో అయిపోయింది..?

Kalyan-ram
2018-03-23 13:03:57

ఇప్పుడు ఎమ్మెల్యే అంటే నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఈయ‌న త‌ప్ప మ‌రొక‌రు గుర్తు రారు. అంత‌గా ఈ కారెక్ట‌ర్ ఓన్ చేసుకున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇప్పుడు ఈయ‌న కెరీర్ పీక్స్ లో ఉంది. క‌ళ్యాణ్ కెరీర్ మొద‌లుపెట్టి 13 ఏళ్లు దాటేసింది. ఈ గ్యాప్ లో చాలా సినిమాలే చేసాడు. పైగా ఓ సినిమా చేస్తున్న‌పుడు మ‌రో సినిమా చేయ‌డాలు.. ఇంకో సినిమా ఒప్పుకోవడాలు ఎప్పుడూ పెద్ద‌గా చేసింది లేదు నంద‌మూరి హీరో. కానీ ఇప్పుడు రూట్ మార్చాడు.. రూల్స్ కూడా మార్చేసాడు. ఇప్పుడున్న పోటీని త‌ట్టుకోవాల‌నో.. లేదంటే నిజంగానే తానే మారిపోవాల‌నుకున్నాడో ఏమో కానీ ఓ సినిమా చేస్తున్న‌పుడే మ‌రో మూడు నాలుగు క‌థ‌లు విని.. క‌నీసం రెండు మూడు సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ఎమ్మెల్యే విడుద‌ల‌కు ముందే మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు క‌ళ్యాణ్ రామ్. 

జ‌యేంద్ర‌తో చేస్తోన్న నా నువ్వే షూటింగ్ కూడా పూర్త‌యింది. మే 18న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఎమ్మెల్యేలో కాజ‌ల్ తో.. నా నువ్వేలో త‌మ‌న్నాతో రొమాన్స్ చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మ‌రో రెండు సినిమాలు ఫైన‌ల్ చేసాడు ఈ హీరో. ఇప్ప‌టికే ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేమ్ ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా క‌మిట‌య్యాడు క‌ళ్యాణ్ రామ్. ఇందులో ఎన్టీఆర్, హ‌రికృష్ణ కూడా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్యే మ‌జ్ను ఫేమ్ విరించివ‌ర్మ‌తో ఓ సినిమాకు సైన్ చేసాడు ఈ హీరో. జెమిని కిర‌ణ్ ఈ చిత్రానికి నిర్మాత‌. మొత్తానికి ఇప్పుడు నంద‌మూరి ప‌టాస్ జోరు మాత్రం మామూలుగా లేదు. ఇవ‌న్నీ హిట్ అయితే ఎన్నాళ్లుగానో క‌ళ్యాణ్ రామ్ కోరుకుంటున్న స్టార్ ఇమేజ్ వ‌చ్చేసిన‌ట్లే.

More Related Stories