English   

నాగ్ వ‌స్తున్నాడు.. ప‌ర్లేదా క‌ళ్యాణ్..?

Kalyan-Ram

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు సోలో విడుద‌ల తేదీ దొర‌క‌డం అనేది చాలా అంటే చాలా క‌ష్టం. దొరికిన ఒక్క తేదీని స్టార్ హీరోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మే 25 కోసం ఇప్పుడు ఇలాంటి పోటీనే జ‌రుగుతుంది. ఆ రోజు ఇద్ద‌రు హీరోలు వ‌స్తున్నారు. నాగార్జున వ‌స్తున్నాడ‌ని తెలిసి కూడా ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కూడా అదే రోజు త‌న సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేసాడు. ఆఫీస‌ర్ మే 25న విడుద‌ల కానుందంటూ ఈ మ‌ధ్యే అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు ముంబైలో జ‌రుగుతుంది. ఇక అదే రోజు క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న నా నువ్వే విడుద‌ల కానుంది. జ‌యేంద్ర తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. త‌మ‌న్నా ఇందులో హీరోయిన్. పిసి శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మే 18న విజ‌య్ దేవ‌ర‌కొండ ట్యాక్సీవాలా విడుద‌ల కానుంది,. ఆ త‌ర్వాత వార‌మే ఈ రెండు సినిమాలు వ‌స్తున్నాయి. ఒకే రోజు రెండు సినిమాలు వ‌స్తే న‌ష్టం అని తెలిసినా కూడా నాగార్జున‌తో పోటీకి సై అంటున్నాడు క‌ళ్యాణ్ రామ్. మ‌రి చూడాలిక‌.. ఈ పోరు ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories