English   

 కళ్యాణ్ రామ్.. ఈసారి ఇద్దరితో

Kalyan-Ram-Nivetha

ఏ హీరో అయినా కంటిన్యూస్ గా సినిమాలు చేయాలనే అనుకుంటాడు. కానీ కొందరి స్పీడ్ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకు కారణం వారి ప్రీవియస్ హిస్టరీ. దానివల్ల వాళ్లు కొత్తగా ఏం చేసినా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడిలాంటి సర్ ప్రైజెసే ఇస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. పటాస్ తర్వాత షేర్ లా దూసుకుపోతోన్న ఈ మంచిలక్షణాలున్న అబ్బాయి ఈ సారి ఇద్దరు భామలతో రొమాన్స్ చేయబోతున్నాడు. పటాస్.. ఇదే కళ్యాణ్ రామ్ ఫేట్ ను మార్చింది. ఆ తర్వాత అతను పటాస్ లా పేలకపోయినా కంటిన్యూస్ గా సినిమాలు  చేస్తూనే ఉన్నాడు. వాటి సక్సస్ సంగతులు పక్కన బెడితే ప్రతి సినిమాతో ఏదో ఒకకొత్తదనం చూపిస్తున్నాడు. ఇదే కళ్యాణ్ రామ్ తో సినిమాలు చేయడానికి ఇతర నిర్మాతలనూ ఎంకరేజ్ చేస్తోంది. మొన్నటి వరకూ సొంత బ్యానర్ లోనే సినిమాలు చేసిన కళ్యాణ్ ఇప్పుడు తన బ్యానర్ నే పూర్తిగా పక్కన బెట్టాడంటే అదే కారణం. 

ప్రస్తుతం నా నువ్వే అంటూ వస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఓ ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ ఎన్నడూ లేనంత రొమాన్స్ చేశాడీ పాటలో. ఈ రేంజ్ రొమాన్స్ తమన్నాకూ ఫస్ట్ టైమ్ కావడం విశేషం.  ఇక దీని తర్వాత మరో సినిమాకూ ఓకే చెప్పాడు కళ్యాణ్ రామ్. గుహన్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇన్నాళ్లూ సినిమాటోగ్రాఫర్ గా ఉన్న గుహన్ తన కథకు కళ్యాణ్ రామ్ ను ఎంచుకోవడం విశేషమైతే.. కళ్యాణ్ రామ్ సినిమాతో పరిచయం అయిన దర్శకుడు టాప్ లీగ్ లో వెళ్లడం గమనార్హం.  ఇప్పుడు గుహన్ కూడా ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ టాప్ లీగ్ లోకి వెళతాడేమో. అయితే ఈ మూవీతో కళ్యాణ్ రామ్ మరో కొత్తదనం చూపించబోతున్నాడు. అదే ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ . యస్.. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ చాలాకాలం తర్వాత ఇద్దరు భామలతో రొమాన్స్ చేయబోతున్నాడు. జెంటిల్మన్, నిన్నుకోరి, జై లవకుశ సినిమాలతో ఆకట్టుకున్న నివేదా థామస్ తో పాటు అర్జున్ రెడ్డితో అలరించిన షాలినీ పాండే కళ్యాణ్ రామ్ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మేరకు ఇది  అఫీషియల్ న్యూస్ గానే చెబుతున్నారు. నివేదా ఆల్రెడీ కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశలో నటించింది కాబట్టి.. మంచి రాపోనే ఉండొచ్చు. ఇక షాలినీ పాండే స్క్రిప్ట్ కు తగ్గట్టుగా నటించే బ్యూటీ. మరి థ్రిల్లర్ మూవీగా చెబుతోన్న ఈ సినిమాలో ఇద్దరితో కళ్యాణ్ రామ్ ఎలాంటి కహానీ నడిపిస్తాడో చూడాలి. 

More Related Stories