English   

అఖిల్ ఇక్క‌డే.. క‌ళ్యాణి అక్క‌డ‌..!

Kalyani-Priyadarshan

అఖిల్ తో న‌టించిన హీరోయిన్లు కెరీర్ లో ఎదుగుతున్నారు కానీ అఖిల్ మాత్రం ఇక్క‌డే ఉన్నాడు. ఈయ‌న‌తో న‌టించిన ఇద్ద‌రు హీరోయిన్లు ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అయ్యే క్ర‌మంలో ఉన్నారు. ఇప్ప‌టికే అఖిల్ ఫేమ్ స‌యేషా సైగ‌ల్ తెలుగులో స్టార్ కాక‌పోయినా త‌మిళ‌నాట దున్నేస్తుంది. అక్క‌డ వ‌ర‌సగా స్టార్ హీరోల‌తో న‌టిస్తుంది. ఇక ఇప్పుడు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ వంతు. ఈ భామ కూడా ఇప్పుడు వ‌ర‌స సినిమాలు చేస్తుంది. ఇప్ప‌టికే హ‌లో సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ కు జోడీగా సుధీర్ వ‌ర్మ సినిమాలో న‌టిస్తుంది క‌ళ్యాణి. ఈ చిత్రంలో క‌ళ్యాణి పాత్ర 80ల్లోకి సంబంధించిన అమ్మాయిగా ఉంటుంది. ఇక ఇది సెట్స్ పై ఉండ‌గానే ఇప్పుడు సాయిధ‌రంతేజ్ త‌ర్వాతి సినిమాలో క‌ళ్యాణినే హీరోయిన్ గా తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సాయి న‌టించ‌బోయే చిత్రంలో క‌ళ్యాణినే తీసుకుంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. దీనికి చిత్ర‌ల‌హ‌రి.. బార్ అండ్ రెస్టారెంట్ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. ఈ రెండు సినిమాల‌తో తెలుగులో క‌ళ్యాణి బిజీ అయిపోవాల‌ని చూస్తుంది. మ‌రి ఇది జ‌రుగుతుందా..?
 

More Related Stories