English   

కమల్ హసన్ కి ముందస్తు బెయిల్

kamal
2019-05-20 20:51:18

ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చాక బయటపడిన మొట్ట‌మొద‌టి ఉగ్ర‌వాది హిందూనేనని అయన ఎవరో కాదు గాంధీని చంపిన  నాథూరామ్ గాడ్సే అని క‌మ‌ల్‌ హాస‌న్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చి పడ్డాయి, కొందరు అయితే అయన మీద చెప్పులతో దాడి కూడా చేశారు. ఇక మరి కొందరు అయన మీద పోలీస్ కంప్లింట్ కూడా ఇచ్చారు. అలా కంప్లింట్ ఇచ్చిన ఒక కేసుకు సంబంధించి ఈరోజు మ‌ద్రాసు హైకోర్టుకు చెందిన మ‌ధురై బెంచ్ క‌మ‌ల్‌ కు ముంద‌స్తు బెయిల్‌ను మంజూరీ చేసింది. ఈ నెలలో ఎన్నికల సందర్భంగా త‌మిళ‌నాడులోని అర‌వ‌కురుచ్చి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తూ క‌మ‌ల్ ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కారూర్ జిల్లాలోని అర‌వ‌కుచ్చి పోలీసులకి కొన్ని ఫిర్యాదులు అందగా అక్కడి పోలీసులు క‌మ‌ల్‌ పై కేసును రిజిస్ట‌ర్ చేశారు. ఐపీసీలోని 153ఏ, 295ఏ కింద మ‌త‌విద్వేషాలు రెచ్చగొడుతున్నార‌న్న కారణాలతో కేసుల‌ను న‌మోదు చేశారు. ఈ నేపధ్యంలో ఎక్కడ అరెస్ట్ చేయబడతానో అనే అనుమానంతో ఆయన ముందస్తు బెయిలు కోసం అర్జీ పెట్టుకున్నారు, ఈరోజు విచారించిన బెంచ్ కమల్  ముంద‌స్తు బెయిల్ ష‌ర‌తుల‌కు అంగీక‌రిస్తున్న‌ట్లు తెలపడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

More Related Stories