English   

హమ్మయ్య...భారతీయుడు మొదలయ్యిందట !

kamal
2019-07-18 08:55:39

దాదాపు పాతికేళ్ళ నాడు వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ? శంకర్ కి ఎంత మంచి పెటు తెచ్చిపెట్టిందో తెలియనిది కాదు. 23 ఏళ్ల తరువాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేసిన శంకర్ భారతీయుడు-2 టైటిల్ తో సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్ళింది. హీరోగా కమల్ నే మళ్లీ ఎంచుకున్నా, సినిమా ప్రారంభం అయిందని ఒకసారి అసలు ప్రారంభమే అవలేదని అలా రకరకాల ప్రచారాలతో సరిపోయింది. ఒకసారి కమల్ ఎలెక్షన్స్ కోసమని ఆగిందని, మరో సారి బడ్జెట్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ కి శంకర్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని రకరకాల ప్రచారాలు  జరిగాయి. ఒకానొక సమయంలో సినిమా ఆపేశారని ఇంకా ఉండకపోవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని అంటున్నారు. ఇప్పటికే కాజల్ ని మెయిన్ హీరోయిన్ గా తీసుకోగా ఇప్పుడు ఈ సినిమా కోసం ఐశ్వర్యా రాజేశ్, ప్రియా భావాని శంకర్ లను కూడా తీసుకున్నారని అంటున్నారు. హీరో సిద్ధార్డ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి తమిళ సంగీత సంచలనం అనిరుధ్ ఈ సంగీతం అందించనున్నారు. చూడాలి మరి ఎప్పటికి షూట్ పూర్హ్తి చేసి ఎప్పటికి రిలీజ్ చేస్తారో ? 

More Related Stories