English   

విరాళమే కాదు..కరోనా నేపధ్యంలో ప్రభుత్వానికి కమల్ మనసున్న ఆఫర్

kamal
2020-03-29 18:48:05

దేశం మొత్తం కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్ జడలు విప్పడంతో దేశంలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు ఆగిపోయాయి.  ఎక్కడి వారు అక్కడే ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియా మొత్తం ఇంటికే పరిమితమైంది. విదేశాల నుంచి ఎవరూ భారత్కు రాకుండా కట్టడి చేశారు. బయటి దేశాల నుంచి వచ్చే ఫ్లయిట్స్ ఎప్పుడో నిలిచిపోయాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అయితే నిన్న ఏకంగా కమల్ హాసన్ కు కరోనా లక్షణాలు కనపడ్డాయని ఆయన సెల్ఫ్ క్వారెంటైన్ కు వెళ్లాడని వార్తలు నిన్న బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు చూసి ఆయన అభిమానులు కూడా ఒక రేంజ్ లో భయపడ్డారు. దీంతో ఆయన వెంటనే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మీ బ్రేకింగ్ న్యూస్ కోసం తప్పుడు వార్తలు రాయొద్దని చెబుతూ సీరియస్ అయ్యాడు కమల్. అంతేకాదు సోషల్ డిస్టేన్సింగ్ కూడా పాటిస్తున్నట్లు లెటర్ విడుదల చేసాడు. దయచేసి జనాలు కూడా అంతా సోషల్ డిస్టేన్సింగ్ మెయింటేన్ చేయడమే కాకుండా ఇంట్లోనే ఉండాలని కోరాడు. ఇప్పటికే రోజువారి సినీరంగంలో కూలీలుగా ఉన్న వారి కోసం భారీ ఆర్ధిక సాయాన్ని ప్రక‌టించిన కమల్ ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి ఆర్థిక సాయంతో పాటు త‌న ఇంటినీ ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆసుపత్రి వాడుకొవ‌చ్చని ప్రభుత్వానికి ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. అందరూ క‌రోనా పేరు చెపితేనే భ‌య‌ప‌డి పారిపోతున్న పరిస్థితుల్లో ఏకంగా త‌న ఇంటినే వారికోసం ఆసుప‌త్రిగా మార్చేందుకు ముందుకు వ‌చ్చిన క‌మ‌ల్‌ ను తమిళ తంబీలు అభినందిస్తున్నారు.

 

More Related Stories