English   

కమల్ హాసన్‌కు కరోనా లక్షణాలు.. ఆయనిచ్చిన క్లారిటీ ఇదే..

Kamal Haasan
2020-03-28 14:32:29

లోకనాయకుడు కమల్ హాసన్ కు కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన సెల్ఫ్ క్వారెంటైన్ కు వెళ్లాడనే వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు చూసి అభిమానులు కూడా కంగారు పడ్డారు. ఆయనకు ఆయనే తెలుసుకున్న తర్వాత క్వారెంటైన్ చేసుకున్నాడనేది దీని సారాంశం. దాంతో వెంటనే కమల్ స్పందించాడు. మీ బ్రేకింగ్ న్యూస్ కోసం తప్పుడు వార్తలు రాయొద్దంటూ సీరియస్ అయ్యాడు కమల్. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. కొన్ని రోజులుగా కేవలం పార్టీ ఆఫీస్ లోనే ఉంటున్నానని చెప్పాడు. 

అంతేకాదు.. సోషల్ డిస్టేన్సింగ్ కూడా పాటిస్తున్నట్లు లెటర్ విడుదల చేసాడు. దయచేసి జనాలు కూడా అంతా సోషల్ డిస్టేన్సింగ్ మెయింటేన్ చేయడమే కాకుండా ఇంట్లోనే ఉండాలని కోరాడు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చాడు కమల్. బ్రేకింగ్ న్యూస్ కోసం లేనిపోని వార్తలు ప్రచారం చేయొద్దంటూ మీడియాను కోరాడు కమల్ హాసన్. మొత్తానికి కమల్ హాసన్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. 

More Related Stories