English   

విశ్వ‌రూపం 2.. అక్క‌డ క‌నెక్ట్ అయింది..!

Kamal-Haasan-Vishwaroopam-2
2018-08-12 13:37:53

విశ్వ‌రూపం 2 సినిమా చూసిన త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు హిందీలో కూడా వ‌చ్చిన మాట డిజాస్ట‌ర్ అని. ఎందుకంటే తొలి భాగం చూసిన త‌ర్వాత రెండో భాగం చూస్తుంటే త‌ల‌నొప్పి ఖాయం. అస‌లు క‌థే లేన‌ట్లుగా ఫ‌స్ట్ పార్ట్ లోని ఎడిటింగ్ సీన్స్ అన్నీ ఇప్పుడు డివిడి చేసి విడుద‌ల చేసిన‌ట్లుగా ఉందంటూ క‌మెంట్స్ కూడా వినిపించాయి. అందుకే తెలుగులో వ‌సూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. అయితే త‌మిళ‌నాట మాత్రం ప‌రిస్థితి మ‌రోలా ఉంది. అక్క‌డ విశ్వ‌రూపం 2కు బాగానే క‌నెక్ట్ అవుతున్నారు ప్రేక్ష‌కులు. చూస్తుంటే త‌మిళ్ లో సినిమా హిట్ అయ్యేలాగే ఉంది. అక్క‌డ ఇప్ప‌టికే 10 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. 

చెన్నైలోనే 2 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది విశ్వ‌రూపం 2. క‌థ‌కు బాగా క‌నెక్ట్ అయ్యారో లేదంటే క‌మల్ న‌ట‌న‌కు ఫిదా అయ్యారో కార‌ణం తెలియ‌దు కానీ ఇప్పుడు విశ్వ‌రూపం 2 త‌మిళ‌నాడులో మాత్రం మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. తొలి భాగం రేంజ్ లో కాక‌పోయినా రెండో దానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు ఆడియ‌న్స్. ఇదే ఇప్పుడు క‌మ‌ల్ కు ఊర‌ట‌. మిగిలిన భాష‌ల్లో ప్లాపైనా.. సొంత భాష‌లో అయినా త‌ను చేసిన ప్ర‌య‌త్నానికి మంచి మార్కులు ప‌డుతుండ‌టంతో గాల్లో తేలిపోతున్నాడు ఈ హీరో. అయితే హిట్ అవ్వాలంటే మాత్రం 50 కోట్ల‌కు పైగానే విశ్వ‌రూపం 2 వ‌సూలు చేయాలి. మ‌రి అంత చేస్తుందా అనేది వేచి చూడాలిక‌..!

More Related Stories