English   

విశ్వ‌రూపం 2 హిట్టా ఫట్టా..?

Kamal Haasan's Vishwaroopam 2 Premiers Talk
2018-08-10 08:25:13

ఐదేళ్ల విరామం త‌ర్వాత క‌మ‌ల్ పోరాడి బ‌య‌టికి తీసుకొచ్చిన సినిమా విశ్వ‌రూపం 2. త‌న కెరీర్ లో ఇంత క‌ష్ట‌ప‌డిన సినిమా మ‌రేది లేదు. అంతగా ఇష్ట‌ప‌డి క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ విడుద‌లైంది. అయితే క‌మ‌ల్ క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం మాత్రం వ‌చ్చిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. విశ్వ‌రూపం 2కు టాక్ నెగిటివ్ గా వ‌చ్చేసింది. ఫ‌స్టాఫ్ అయితే మ‌రీ దారుణంగా ఉందని.. సెకండాఫ్ లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయి అని టాక్ వినిపిస్తుంది. ఓవ‌రాల్ గా సినిమా ప‌రంగా చూస్తే మాత్రం క‌మ‌ల్ కు మరో ఫ్లాప్ ఖాయం అంటున్నారు ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్. త‌మిళ‌నాట కూడా సినిమా వ‌ర్క‌వుట్ అయ్యేది త‌క్కువే అంటున్నారు. ముఖ్యంగా క‌థ లేకపోయినా.. స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టేలా సీన్స్ సాగ‌దీసాడంటున్నారు ప్రేక్ష‌కులు. తొలిభాగంలో వ‌ర్క‌వుట్ అయిన స్క్రీన్ ప్లే.. ఈ సారి మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మ‌రి ఈ టాక్ తో విశ్వ‌రూపం 2 ఏం చేస్తుందో చూడాలి..!

More Related Stories