English   

కమల్ హాసన్ తో నయనతార ఢీ..?

kamalhassan
2018-07-15 19:23:08

కమల్ హాసన్ ను నయనతార ఢీ కొట్టడం ఏంటీ అనుకుంటున్నారా..? నిజమే.. కాలం కలిసొస్తే ఎవరు ఎవర్నైనా ఢీ కొంటారు. ప్రస్తుతం నయనతార రేంజ్ మామూలుగా లేదు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ ను అనుభవిస్తోంది. తను సినిమా చేస్తే చాలు.. వెంటనే హిట్ అంటున్నారు ఆడియన్స్. ఓ మీడియం రేంజ్ స్టార్ కు ఉన్నంత ఓపెనింగ్స్ ఉన్నాయి. అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ కూడా ఉందనుకోండి. తను డేట్స్ ఇస్తే చాలు అని బ్లాంక్ చెక్స్ పట్టుకు తిరిగే నిర్మాతలకు లెక్కేలేదు. తను మాత్రం మంచి కథలకే ప్రాధాన్యం అంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం నయనతార ‘కొలమావు కోకిల’ అనే సినిమా చేస్తోంది. ఇందులో తనది డ్రగ్స్ సప్లై చేసే అమ్మాయి పాత్ర. హీరో ఉండడు. కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్ట్ 10న విడుదల చేయబోతున్నారు. ఇందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారేమో.. ఉంది. 

ఆగస్ట్ 10 లోకనాయకన్ కమల్ హాసన్ విశ్వరూపం-2 కూడా రాబోతోంది. యస్.. అంటే కమల్ కు పోటీగా నయనతార సినిమా వస్తోందన్నమాట. నిజానికి కమల్ హాసన్ రేంజ్ కు నయన్ రేంజ్ కు ఎంత తేడా ఉందో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మార్కెట్ ప్రకారం చూస్తే నయన్ రేంజ్ తన మార్కెట్ వరకూ సూపర్ గా ఉంది. కానీ రెండేళ్లుగా సినిమాలేని కమల్ పరిస్థితి ఖచ్చితంగా అంచనా వేయలేం. విశ్వరూపం హిట్ అయినా.. దానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీ రావడానికి నాలుగేళ్లు పట్టింది. సో.. నయన్.. కమల్ ను ఢీ కొట్టడంలో తప్పేం లేదు. బట్.. విశ్వరూపం-2కు హిట్ టాక్ వస్తే కోకల కాస్త నలిగిపోక తప్పదు.. 

More Related Stories